సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోపు చేదించారు.నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీపీ సజ్జనార్ ఏ1 గా మహమ్మద్‌ ఆరిఫ్‌, ఏ2 గా జొల్లు శివ, ఏ3 గా జొల్లు నవీన్‌, ఏ4 గా చింతకుంట చెన్నకేశవులు లను పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ పేర్కొన్నారు. నిందితులు పక్కా ప్రణాళికతో యువ డాక్టరును హత్య చేసినట్లు నిర్ధారించారు. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది.

 

ప్రియాంక రెడ్డి హత్య లో నలుగురు నిందితులతో పాటు మరొక నిందితుడు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణ లో అయిదవ నిందితుడు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిన్న రాత్రంతా పోలీసులు నలుగురు నిందితులను విచారించినట్లు తెలుస్తోంది పోలిసుల విచారణలో తమతో పాటు మరొక వ్యక్తి అఘాయిత్యం లో పాల్గొన్నట్లు నిందితులు తెలిపినట్లు సమాచారం. అయిదవ నిందితుడు నారాయణపేట జిల్లా పొర్ల వాసి గా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

 

నిన్న పట్టుబడ్డ నలుగురు నిందితలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం షాద్ నగర్ కోర్టు లో హాజరు పరచనున్నారు పోలీసులు. తమ కస్టడీ లో ఎన్ని రోజులు కావాలో పోలీసులు కోర్టు ను అడగనున్నారు. ఈ నేపథ్యంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ను  పెద్ద ఎత్తున ప్రజలు ముట్టడించారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉరి వెయ్యాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మరో వైపు జాతీయ మహిళ కమిషన్ సభ్యులు ప్రియాంక రెడ్డి ఇంటికి వచ్చారు కుటుంబ సభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పదే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: