హైదరాబాదులోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక మరణం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశం మొత్తాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఆమెకు మద్దతుగా కేవలం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా పలువురు సంతాపం తెలిపారు. అయితే దేశం నలు వైపుల నుండి వస్తున్న అభ్యర్థన ఒక్కటే. ఇకపై ఇలాంటి తప్పు చేసేవారికి ఒక ఆడపిల్లను ఆమె అనుమతి లేకుండా ముట్టుకోవడానికి వణికేలా శిక్ష వేయాలి అని. ఇటువంటి ఛాలెంజింగ్ పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం.

 

నిర్భయ చట్టం లాంటివి ఎన్నో వచ్చినా కూడా దేశంలో జరుగుతున్న అత్యాచారాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రియాంకను అత్యాచారం చేసి చంపిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వినడానికి కొంచెం సినిమాటిక్ గా ఉన్నా కూడా కచ్చితంగా ఇది జరగబోయే దారుణాలని ఆపుతుంది అని వారి భావన. అయితే ఈ పనిని పోలీసు వారు పబ్లిక్ లో చేస్తారా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

 

ఇకపోతే ప్రియాంకను కాల్చి చంపిన స్థలానికి కొంచెం దూరంలో దొరికిన మరొక కాలిపోయిన శవానికి కారణమైన నిందితులు ఎవరో పట్టుకునే పనిలో ఉన్నారు పోలీస్ వారు. ఇక పోతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే తర్వాత శంషాబాద్ లో దొరికిన మరొక శవానికి సంబంధించిన నిందితులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి హడలిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం చూసి సమాజంలో మన మధ్య తిరిగే మానవ మృగాలు కొంచమైనా భయపడి వారి ఆగడాలను ఆపుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: