ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ఒక సామెత ఉండనే ఉంది. కానీ అది కేవ‌లం ఏదో ఒక కొటేష‌న్‌లానే చూస్తున్నారు త‌ప్పించి. ఎవ్వ‌రూ ఆచ‌రించరు ఆచ‌రించ‌ట్లేదు. పైగా అమ్మాయిల‌ను అమాంతం అత్య‌చారం చేసి కాల్చిమ‌రి చంపేస్తున్నారు. అస‌లు ఈ దేశంలో ఆడ‌వారికి భ‌ద్ర‌త లేదా. మ‌గ‌వారితో స‌మానంగా ధైర్యంగా బ్ర‌తికే హ‌క్కు లేదా అంటూ కొన్ని ప్ర‌శ్న‌లు వెలువ‌డుతున్నాయి.  మాతృదేవో భవ అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి.

 

బయట ఆందోళన చేపట్టింది. నేను నా సొంత దేశంలో సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవడం లేదు ఎందుకూ అని ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డ్ పట్టుకుని ఢిల్లీలోని పార్లమెంట్ బయట నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు అను దూబేను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ జీపు ఎక్కించి తనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ బృందం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. కొద్ది సేపటికే పోలీసులు అను దూబునే విడుదల చేశారు.

 

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిని నాలుగు మానవ మృగాలు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ లో మరో యువతి కూడా అలాగే బలైపోయింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా ఓ లా స్టూడెంట్ ని కొందరు యువకులు ఆయుధాలు చూపించి ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేశారు. ఈ విధంగా దేశంలో మహిళపై జరుగుతున్న దాడులు, నేరాలను వార్తల్లో చూసి కలత చెందిన అను దూబే ఇవాళ పార్లమెంట్ బయట దేశంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ఆందోళనకు దిగింది. ఇలా ఆమె ఈ విధంగా త‌న బాధ‌ను వెల్ల‌డించింది. ఏం చేయాలో అర్ధం కాక ఆడ‌పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: