రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఆరు మాసాలు పూర్త‌య్యాయి. అనేక కీల‌క ప్రాజెక్టులు, ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ రూప‌క‌ల్ప‌న చేశారు. నేటి నుంచి అంటే శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు.. ఈ ఆరు మాసాల పాల‌న పై పెద్దఎత్తున కార్యక్ర‌మాల రూపక‌ల్ప‌న‌కు సిద్ధ‌మ‌య్యాయి. జ‌గ‌న్ పాల‌న‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో నా పాల‌న‌కు కనీసం 6 నెల‌ల గ‌డువు ఇవ్వండి. మీతో మంచి సీఎం అనే పేరు తెచ్చుకుంటా! అని జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.

 

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు. మంచి సీఎంగా ఉండే క్ర‌మంలో రూపాయి జీత‌మే తీసుకుంటున్నార‌ని వైసీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు.
ఇక‌, విలాసాల‌కు రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌డం లేదు. పైగా విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్తే.. త‌మ సొంత డ‌బ్బుల‌నే వినియోగించుకుంటున్నట్టు ప్ర‌భుత్వ‌మే జీవో ఇచ్చింది. వీట‌న్నింటికీ మించి ఎవ‌రు ఆప‌ద‌లో ఉన్నా.. ఎవ‌రు ఆర్థికంగా సాయం కోసం వ‌చ్చినా.. ఉదారంగా స్పందిస్తున్నారు.

 

భారీ ఎత్తున గ‌త ప్ర‌భుత్వంలో వినిపించిన నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు ఎక్క‌డా లేదు. పైగా అంద‌రికీ సంక్షేమం పేరుతో ప్ర‌తి ఒక్క పేద వారికి, అర్హులైన వారికి ప‌థ‌కాల‌ను చేరువ చేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి ఉన్న ఆంక్ష‌ల‌ను పూర్తిగా స‌డ‌లించారు. ఆరోగ్యాన్ని అంద‌రికీ చేరువ చేశారు. పాఠ‌శాల‌ల్లో ఉన్న‌త నాణ్య‌త‌తో కూడిన విద్య‌ను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మ ఒడిని వ‌చ్చే ఏడాది నుంచి అమ‌లు చేస్తున్నారు.

 

అంద‌రికీ ఇళ్లు ఇస్తున్నారు. రైతుల‌కు ఆర్థికంగా భ‌రోసా ఇస్తున్నారు. పంట‌లు వేసే స‌మ‌యంలో జ‌గ‌న్ సాయం చేయ‌డం ప్రారంభించారు. ఇప్పుడు గ్రామాల్లో ఎక్క‌డ చూసినా.. జ‌గ‌న్ పేరు స్ప‌ష్టంగా వినిపిస్తోంది. రాజ‌న్న బిడ్డ బాగా పాలిస్తున్నాడు... అనే పేరు వ‌స్తోంది. ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు జ‌గ‌న్‌. ఇదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం చంద్ర‌బాబుకు కంట‌గింపుగా ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఈ క్ర‌మంలో నేటి నుంచి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వారం రోజుల పాటు జ‌గ‌న్ పాల‌న‌పై చ‌ర్చ‌, స‌మావేశాలు పెట్టున్నార‌ని స‌మాచారం.

 

ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. టీడీపీకి మ‌రింత‌గా క‌ష్ట‌కాలం దాపురించ‌డ‌మేన‌ని బాబు త‌ల‌పోస్తున్నారు. అదేస‌మ‌యంలో ఈ వారం రోజుల్లో పార్టీలోకి వ‌చ్చే దిగువ శ్రేణి నాయ‌కుల‌ను కూడా చేర్చుకునేందుకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై దాడిని పెంచాల‌ని... కొత్త కుట్ర‌ల‌కు తెర‌లేపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి గాను ఆయ‌న త‌న‌కు అనుకూలంగా ఉన్న మీడియాను వినియోగించుకునేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: