రాజన్న రాజ్యం తీసుకొద్దామని వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు చెప్పారు.  ఎన్నికల సమయంలో ఇచ్చినట్టుగా జగన్ హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు.  దానికి డబ్బు ఎలా తెస్తున్నారు ఏంటి అనే విషయాలు ప్రభుత్వం చూసుకుంటుంది.  ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల కోసమే అనే విధంగా జగన్ పరిపాలన చేస్తున్నారు. ఒక మనిషిని మానవత్వం లేకుండా మార్చేది మద్యం ఒక్కటే.  అందుకే ఆ మద్యం పై నిషేధం విధించారు.  దశలవారీగా దానిని తగ్గించేందుకు జగన్ తగిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.  
ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 వ తేదీ రాత్రి 8 గంటలతో ప్రైవేట్ మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి.  ఆ తరువాత ఆ స్టాక్ మొత్తాన్ని, షాపులను ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుంది.  అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతున్నది.  మద్యం దుకాణాలు నడపడంతో పాటుగా ఖచ్చితమైన సమయ పాలన తీసుకొచ్చి మద్యాన్ని కంట్రోల్ చేసింది.  దీంతో ఇప్పుడు ఏపీ లో మద్యం పెద్దగా దొరకడం లేదు.  
క్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను కూడా ఎత్తివేసి.. అక్కడి నుంచి ఎన్నికల సమయం వరకు మూడు, ఐదు నక్షత్రాల హోటల్స్ కు పరిమితం చేయాలని ప్రభుత్వం చూస్తున్నది.  ఇది మంచి నిర్ణయంగా చెప్పాలి.  ఏ ప్రభుత్వమైనా మద్యం అమ్మకాలను పెంచాలని చూస్తుంది.  ఎందుకంటే, మద్యం అమ్మకాలు జరిగితేనే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.  కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి వ్యతిరేకం అని చెప్పాలి.  
మద్యాన్ని నిషేదిస్తే దాని వలన కొంతమేర ప్రభుత్వానికి నష్టం వచ్చినా మహిళల మానప్రాణాలకు రక్షణ ఉంటుంది.  మద్యం బానిసత్వం నుంచి ప్రజలు బయటపడతారు.  ఆంధ్రప్రదేశ్ లోని మహిళలు కోరుకున్నది ఇదే.  అందుకే మహిళలు జగన్ కు సపోర్ట్ చేశారు.  ఈ సపోర్ట్ తోనే ఇప్పుడు జగన్ ఇప్పుడు మరింత ముందుకు వెళ్తున్నారు.  మరింత ఎక్కువగా ప్రజల కోసం పనిచేస్తున్నారు.  జగన్ చెప్పినట్టుగానే ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: