జగన్ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల కాలంలో జగన్ పని తీరు చూస్తే తాను చేయాలనుకున్న పనిపై తప్ప మరే విధమైన విషయాల గురించి పట్టించుకోవటం లేదు. మీడియా అటెన్షన్ కావాలి.. తాను మీడియాలో రావాలి అనేకన్నా తన పాలన గురించి మీడియానే దృష్టి పెట్టేలా చేసారనడంలో అతిశయోక్తి లేదు. విమర్ళలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ జగన్ తీరు చూస్తే దానిపై అంత శ్రధ్ద పెట్టలేదు.

 

 

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తన పనే సమాధానంగా చెప్తున్నారు ఏపీ సీఎం. విపక్షంలోని ప్రతి నాయకుడు ప్రతి రోజూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటమే ఇక్కడ గమనించాల్సిన విషయం. తాము అనుకుంటున్న విషయాలను ప్రజలే చెప్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం, ప్రజల్లోకి తమ అభిప్రాయాలను రుద్దేందుకు చూస్తున్నారు తప్ప జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చూడటం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సవాళ్లను ఎదుర్కోవడంలో ఏ పాలకుడికి తెగువ ధైర్యం కావాలి. దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పన అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ అంశం కొంతమందికి మింగుడుపడకపోగా ప్రజల్లో మాత్రం ఆలోచన రేకెత్తిస్తుంది.

 

 

చేసే పనిని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉన్న పాలకుడికి, గొప్పలు చెప్పుకునే పాలకులకు చాలా తేడా ఉంటుంది. పాలకులకు ఎప్పుడూ.. ఇంకెంత చేస్తే అభివృద్ధి బాట పడతామో అనే ఆలోచిస్తారు. ప్రజల శ్రేయస్సు కోరుతూ తగిన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాలకు మేలు చేయాలంటే ఆర్ధికపరమైన క్రమశిక్షణ కూడా అవసరమే. అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ నవరత్నాల పథకాలు అమలుకు కృషి చేస్తున్నారు సీఎం జగన్. ఇలాగే ముందుకు సాగితే మంచి సీఎంగా ప్రజల గుండెల్లో నిలిచిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: