హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే . నలుగురు నిందితులు పథకం ప్రకారం ప్రియాంక రెడ్డి ని అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన  దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సినీ రాజకీయ ప్రముఖులు అందరు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రియాంక రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడడానికి ఒకే ఒక లింకు దొరికింది పోలీసులకు. అదేంటంటే... పథకం ప్రకారం ప్రియాంకా రెడ్డి స్కూటీ యొక్క వెనుక టైర్ ను  నిందితులు పంచర్  చేసిన విషయం తెలిసిందే. స్కూటీ తీసుకొని వెళ్ళడానికి ప్రియాంక రెడ్డి పార్కింగ్ స్థలం కి వెళ్ళింది. 

 

 

 

ఇంతలో అక్కడికి చేరుకున్న నిందితులు  స్కూటీ వెనక టైరు పంచర్ అయిందని  ప్రియాంక రెడ్డికి  చెప్పారు. నిందితుల్లో ఒకరు తన స్కూటీని బాగు చేయించటానికి వెళ్లారు . అయితే అపరిచితులకు తన స్కూటి  ఇవ్వడానికి సందేహించిన  బాధితురాలు ప్రియాంక రెడ్డి నిందితుడి సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంది . అయితే బండిని బాగు చేయడానికి వెళ్లిన వారు 15 నిమిషాలు అయినప్పటికీ రాకపోవడంతో ప్రియాంకరెడ్డి తన ఫోన్ నుంచి నిందితుడికి ఫోన్ చేసింది. కాగా పోలీసులు ప్రియాంక రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఈ ఫోన్ కాల్ కీలకంగా మారింది. ఒక రాత్రి 9.59 గంటల సమయంలో ప్రియాంక రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రియాంక రెడ్డి  తన ఫోన్ నుంచి చివరి కాల్ ఎవరికి చేసిందో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు . 

 

 

 

ఈ క్రమంలోనే ప్రియాంక రెడ్డి నలుగురు నిందితులను ఒకరికి ఫోన్ కాల్ చేసినట్లు తెలిసింది. దీంతో ఆ నెంబరు ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడంతో  ప్రియాంక రెడ్డి హత్య కేసు చిక్కుముడి వీడిపోయింది. కాగా  ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వీ  వాంట్  జస్టిస్  అనే నినాదాలు హోరెత్తుతున్నాయి . అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ దేశ ప్రజానీకం నినదిస్తోంది. అటు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ప్రియాంక రెడ్డి హత్య కేసులోని నిందితులను ఎన్ కౌంటర్ చేయండి లేకపోతే ఉరితీయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: