ఆర్నెళ్ళ క్రితం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన  జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పట్టుదలతో కృషి చేస్తున్నారు . ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం , ఆ తరువాత మాటమార్చడం ఇటీవల రాజకీయాల్లో పరిపాటిగా మారిన విషయం తెల్సిందే . కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం  ఈ ఆర్నెళ్ళ వ్యవధిలోనే ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు . ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలుచేస్తామన్న జగన్ , రాష్ట్ర ఖజానా ను సైతం లెక్కచేయకుండా , దశలవారీగా మద్యపాన నిషేధం అమలు కోసం అడుగులు వేస్తున్నారు .

 

మద్యం దుకాణాలను తగ్గించడమే కాకుండా , ప్రభుత్వ ఆధ్వర్యం లోనే మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెల్సిందే . ఇక ఎనిమిది గంటలకే మద్యం దుకాణాలను మూసివేసేవిధంగా ఆదేశాలు జారీ చేశారు .  బార్లను సంఖ్య ను తగ్గించిన జగన్ , ఇక మద్యం విక్రయం లోను నిబంధలను అమలు చేస్తున్నారు . దీనితో జగన్ ఇచ్చిన మాట నెరవేరుస్తారని నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడింది . అధికారం లోకి వచ్చిన వెంటనే రైతుభరోసా , అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం , అమ్మ ఒడి , ఆరోగ్యశ్రీ , వాహన మిత్ర , నాయీబ్రాహ్మణ మిత్ర వంటి పథకాలతో జగన్ అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు . ఇక గ్రామసచివాలయ వలంటీర్ల నియామకం తో జగన్ , పెద్ద సంఖ్యలో నిరుద్యోగ ఆశలను తీర్చినట్లయింది .

 

అయితే ఈ ఆర్నెళ్ళ వ్యవధిలో విపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయి విమర్శలే చేశాయి . ప్రధానంగా ఇసుక కొరత జగన్ సర్కార్ ను ఇబ్బంది పెట్టింది . జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇసుక కొరతను అధిగమించే ప్రయత్నం చేసింది . ఇక రాజధాని అంశాన్ని విపక్షాలు వివాదం చేయాలనీ చూశాయి కానీ జగన్ సర్కార్ ఆర్భాటపు ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించి వివాదానికి ముగింపు పలికింది  .

మరింత సమాచారం తెలుసుకోండి: