విధి చాలా విచిత్రమైంది ఎప్పుడు నవ్విస్తుందో, ఎప్పుడు ఏడిపిస్తుందో తెలియదు. ఎవరిని ఎప్పుడు కలుపుతుందో, ఎప్పుడు విడదీస్తుందో తెలియదు.. ప్రతి వారి జీవితాన్ని చదరంగం లా చేసి ఆడించే కాలానికి లొంగని వారు ఎవరు ఉండరు. ఇకపోతే పెళ్లి అనేది కొందరి జీవితాన్ని మధురంగా మారుస్తే మరి కొందరి జీవితాన్ని విషాదంగా మలుస్తుంది.

 

 

ఈ బ్రతుకులో మరచిపోని జ్ఞాపకంగా ఉన్న సంఘటనల కంటే మనిషిగా పుట్టాక కన్నీటితో జీవించే ఘటనలే ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర ఘట్టం. ఇలాంటి కార్యాన్ని ఘనంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రతి వారు ఆశిస్తారు. ఇలా అనుకున్న ఓ జంట యింటిలో మరచిపోలేని విషాదం జరిగింది. కాళ్ల పారాణి ఆరక ముందే ఆ నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది.

 

 

పలాస మండలం గరుడఖండి గ్రామంలో పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెంది న గోపీనాథ్‌ అలియాస్‌ సురేష్‌కు ఇచ్చి ఈ నెల 28వ తేదీ గురువారం రాత్రి నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. శనివారం ఉదయం ఐదు గంటలకు దమయంతికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే సమయంలోనే మృతి చెందింది.

 

 

కాళ్ల పారాణి ఆరకుండానే దమయంతికి నూరేళ్లు నిండిపోవడంతో కన్నవారు, అత్తింటి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ఈ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా నిలిచింది. ఈ ఘతనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నిజంగా దురదృష్టం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అందుకే అంటారు మనిషి ఎంతగా విర్రవీగిన చివరకు సమయం వచ్చినప్పుడు మరణం తన పని తాను చేసుకుంటూ పోతుందని. నిజమే కదండి ఆనందంగా ఉన్న ఇంట ఇలా విషాదం నిండటం భాదాకరం..

మరింత సమాచారం తెలుసుకోండి: