డిసెంబర్ 2 నుండి 8 వరకు మావోయిస్టు పి ఎల్ జి ఏ వారోత్సవాల సందర్భంగా ఏవోబిలో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని మన్యం ఆదివాసీయులు ఆందోళనలో ఉన్నారు. దీంతో ఏవోబీలో యుద్ధ వాతావరణం ఏర్పడింది ఆంటే నమ్మండి. ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహించడం జరుగుతుంది. సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, పిఎల్ జి వారోత్సవాల సందర్భంగా రిక్రూట్మెంట్ చేసుకోవడం చోటు చేసుకుంటుంది. 

 

అమరవీరుల ఆశయ సాధన పేరుతో మండలంలో పలు విధ్వంసకర సంఘటనలకు పాల్పడటం, పోలీస్ ఇన్ ఫార్మర్ పేరిట హత్యలు చేయడం వంటి సంఘటనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల వారోత్సవాలు అడ్డుకోవడానికి ఏవోబీలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగడం మొదలు పెట్టారు. మన్యంలో తిరిగే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేపట్టడం చేస్తున్నారు. అనుమానితులు ఉంటే వారి వివరాలు సేకరించి తర్వాత నిర్ధారించి పంపడం జరుగుతుంది. ఏవోబీలో బిఎస్ఎఫ్, గ్రేహౌండ్స్, సిఆర్పిఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు ఆంటే నమ్మండి. 

 


మన్యంలో మావోయిస్టులు ల్యాండ్ మైన్, ఇతర పేలుడు పదార్థాలను ఉపయోగించి పోలీసుల పై దాడులు చేసే అవకాశం ఉన్నందున ల్యాండ్ మైన్  ను  పసిగట్టేందుకు పోలీసు జాగిలాలను కూంబింగ్ కు తీసుకు పోవడం జరుగుతుంది. గత రెండు సంవత్సరాలుగా భారీగా ఎన్ కౌంటర్లతో భారీగా మావోయిస్టులు మృతి చెందడం, మిలీషియాతో పాటు కింది స్థాయి మొదలుకొని డివిజనల్ కమిటీ స్థాయి వరకు పెద్ద ఎత్తున మావోయిస్టులు పోలీసులకు లొంగిపోవడంతో మావోయిస్టుల కదలికలు మన్యంలో లేకుండా అయ్యాయి . అయితే వారోత్సవాల సందర్బంగా వాడవాడలా పిఎల్ జిఏ వారోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో మన్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని మన్యం వాసులు ఆందోళనలు ఉన్నారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: