ఎంతో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరు, అలానే తెలంగాణ పోలీసుల నిర్లక్ష్య వైఖరి పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తున్నాయి. ఈ విషయంపై జాతీయ స్థాయిలో కూడా ఎంతో చర్చనీయాంశమైంది. ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నాయకుడు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ వచ్చి బాధిత కుటుంబాల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

 

కానీ, తెలంగాణకు  ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బాధిత కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి, అలాగే అందరి ఆగ్రహాన్ని కూడా గురవుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ ‘ప్రియాంకరెడ్డి చెల్లెలకు ఫోన్ చేసిందని.. పోలీసులకు ఫోన్ చేయకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని.. ఆమె తప్పుకూడా ఉందని ’ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

 

 మనుషులు ఎవరు మాట్లాడలేని పనిచేసిన ఆ కామాంధులు అరెస్టయ్యారు. ఈ దారుణంపై దేశమంతా స్పందిస్తున్న కేసీఆర్ మాత్రం అస్సలు నోరు మెదపకపోవడంపై  అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. క్రితం సంవత్సరం తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మరణించినప్పుడు కూడా ఆయన ఇలానే మౌనం పాటించారు.

 

 తాజాగా జాతీయ మీడియా ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ప్రియాంక రెడ్డి విషయంలో కేసీఆర్ స్పందించకపోవడం తీవ్రంగా తప్పు పట్టారు. దీనికి సంబంధించిన చర్చలో పాల్గొన్న టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ని అర్ణబ్ గోస్వామి ఒక ఆట ఆడుకున్నారు. ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపించి అతని పరువు మొత్తం తీసేసాడు. ఇంత పెద్ద విషయం లో కెసిఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి టైమ్ కూడా లేదా అని ప్రశ్నించాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు సడన్ గా సైలెంట్ అయిపోతారో అర్థం కాదు చూడాలి ఇప్పుడు అన్న సీఎం స్పందిస్తారో లేదో. 

మరింత సమాచారం తెలుసుకోండి: