ఇప్పుడు ఎవరి నోట విన్నా అర్ పాపం ప్రియాంక రెడ్డిని ఆ దొంగ నా **** లు దారుణంగా రేప్ చేసి చంపేశారురా.. ఇది దారుణామమైన విషయంరా.. వాళ్ళను నిలువునా కోసెయ్యాలి.. చంపెయ్యాలి.. నరికెయ్యాలి అని అంటున్నారు.  నిజమే ప్రజల ఆవేదన, కోపం అలా ఉన్నాయి.  సమాజంలో ఆడపిల్లలు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతున్నది.  ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.  
అందుకే ఈ బాధంతా.  ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసిన నలుగురు నిందితుల్లో ఒకడు మినహా చూసేందుకు మిగతా ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్టు ఉంటారు.  కానీ, చాలా ముదుర్లు .. ఆ వయసులో ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అంటే మాములు విషయం కాదు.  ఏ 2 నుంచి ఏ 4 వరకు అందరూ బంధువుల పిల్లలే.  అయినప్పటికీ వారు ప్రవర్తించిన తీరు దారుణం.  మోటార్ ఫీల్డ్ లో ఉండే వ్యక్తులు అలానే ఉంటారు.  అందరు అని అనకూడదు.  చాలా వరకు మాత్రం వారి స్వభావం ఎందుకో అలానే ఉంటుంది.  
ఇందులో ఏ 4 నిందితుడు చెన్నకేశవులకు పెళ్లి అయింది.  ప్రేమ వివాహం.  కనీసం 20 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవో కరెక్ట్ గా తెలియదు.  కానీ, అప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  మాములుగా పెళ్లి చేసుకున్నాడు అంటే సరే అనుకోవచ్చు.  ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు... ఇంటి దగ్గర తనను నమ్ముకొని కుటుంబం ఉన్నది.  పైగా ఇప్పుడు ఆమె ఒట్టిమనిషి కాదు.. గర్భవతి.. భర్త ఇలాంటి నీచానికి పాల్పడ్డాడు అంటే ఏ భార్య కూడా తట్టుకోలేదు.  
గర్భవతిగా ఉన్నప్పుడు ఆ భార్య ఇలాంటి విషయం వింటే ఎంతగా కుంగిపోతుందో చెప్పలేం. ఎలాంటి వ్యక్తులైనా ఇలా చేస్తారని అసలు ఊహించలేదు. అయితే, చెన్నకేశవులు భార్య లక్ష్మి మాత్రం ధైర్యంగా ఉన్నది.  భర్త చేసింది తప్పే కాబట్టి ఆ భర్త నాకొద్దు.. అతన్ని చంపేయండి అని చెప్పడం నిజంగా గ్రేట్.  అలాంటి గుండె నిబ్బరం కలిగిన అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు.  ఒక్క ఆమె కాదు.  నలుగురు నిందితుల తల్లులు కూడా ఇలానే చెప్తున్నారు.  తమ పిల్లలు తప్పు చేశారని అంటే చంపేయండి అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: