భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, రాబోయే కర్ణాటక ఉప ఎన్నికలలో ఓటరు మహాశయులు వారికి  గుణ పాఠం నేర్పుతారు అని  కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బిజెపి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్ర,  కేంద్ర స్థాయిలో బిజెపి తమ అధికారాన్ని   ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు అని ఖర్గే   పేర్కొన్నారు.

 

 

బిజెపికి గుణ పాఠం నేర్పడం చాలా ముఖ్యం మరియు మేము మొత్తం 15 స్థానాలను గెలుస్తాము అని,  మిత్రపక్షామైన  జెడి (ఎస్) తో  పార్టీ సంబంధాలు చెడిపోలేదని , ఉప ఎన్నికల  ఫలితాల తరువాత జెడిఎస్ మరియు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  అనర్హత  వేటు పడిన ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఓడిపోతారని,  వారు పార్టీని మోసం చేశారని, వారిపై  ప్రజలకు నమ్మకం లేదని  ఖార్గే పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి బిజెపి దుర్మార్గపు మార్గాలను ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు.

 

 

బిజెపి ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తోందాని ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని,  ప్రస్తుతం బిజెపి ఓటర్లపై  ఒత్తిడి తెస్తోందాని అన్నారు.  ఈ మార్గాల ద్వారా వారు విజయవంతం కాకపోతే,  ఎన్నికలలో  గెలవడానికి వారు  మతపరమైన విద్వేషాలను  రెచ్చగొడతారని   ఆయన అన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్ణాటకను నిర్లక్ష్యం చేశారని మరియు రాష్ట్రనికి సంబందించిన విషయాలలో వారు ఆసక్తి చూపెట్టడం లేదు అని  ఖార్గే పేర్కొన్నారు.

 

కర్ణాటకలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రం నుండి నిధులు తీసుకువస్తామని బిజెపి స్థానిక నాయకత్వం వాగ్దానం చేసింది, కాని ఇంత పెద్ద  విపత్తు   వరద రూపం లో వచ్చిన   కూడా వారు ఏమీ చేయలేకపోయారు.  ఈ  విపత్తుకర పరిస్థితులలో  మోడీ కర్ణాటక గురించి ఏమి మాట్లాడలేదు అని , అలాగే రాష్ట్రన్నీ కూడా  సందర్శించలేదు అని ఖర్గే పేర్కొన్నారు.

 

నా అభిప్రాయం ప్రకారం మోడీ కర్ణాటకను ద్వేషిస్తున్నారు, కారణం ఏమిటో నాకు తెలియదు. అయన  యడియురప్పను ద్వేషిస్తున్నందున కర్ణాటకను ద్వేషిస్తారా ? లేక మనకు తెలియని కారణాల వల్ల అయన కర్ణాటక ను ద్వేషిస్తారా  నాకు మాత్రం తెలియదు అలాగే   ఆయన ఎప్పుడూ కర్ణాటకకు  సహాయం  చేయలేదు అని ఆయన పేర్కొన్నారు.

 

మహారాష్ట్ర  రాజకీయాల పై మాట్లాడుతూ ఖార్గే ఇలా అన్నారు.  మా పార్టీ అధ్యక్షుడు  అనుకూలంగా లేనప్పటికీ కూడా  మేము శివసేనతో కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాము. అయితే ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు మరియు వామపక్ష పార్టీల సూచనలు బిజెపిని అధికారానికి దూరంగా ఉంచాలని సూచించాయి, అందుకే మేము ఎన్‌సిపి మరియు శివసేనలతో కలిసి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాము. మేము ఈ  ఫాసిస్ట్ పార్టీని  అధికారానికి  దూరంగా  ఉంచాలనుకుంటున్నాము అని ఖర్గే పేర్కొన్నారు.

 

కర్ణాటకలోని 17 సీట్లలో 15 స్థానాలకు గాను  ఉప ఎన్నికలు డిసెంబర్ 5 న జరగనున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9 న ప్రకటించబడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: