ఏపీ లో జగన్ సర్కార్ కొలువుదీరి ఆరు నెలలు పూర్తి అయింది. ఈ ఆరు నెలల్లో సంక్షేమ పథకాలతో ప్రజల మనసును చూరగొన్నారు సీఎం జగన్. తాజాగా భూ వివాదాలపై అధికారులతో చర్చించిన సీఎం ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ రద్దు చేసిన కరణం మున్సిఫ్ వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఇదే విషయంపై ఒక ఆంగ్ల పత్రిక కూడా జగన్ కర్ణం మున్సిఫ్ వ్యవస్థను మళ్ళీ తెస్తున్నారంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 21,848 గ్రామాల్లో కరణం మునిసిఫ్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టి రెవెన్యూ పరిపాలనా విషయాలను క్రింది స్థాయి నుంచి పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే, కరణం-మునిసిఫ్ వ్యవస్థకు కొత్త పేరును పెట్టనున్నట్లు సమాచారం. ప్రతిపాదిత వ్యవస్థ ప్రకారం, భూ రికార్డులను ప్రక్షాళన చేసే కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొంటారు. అంతేకాకుండా, భూస్వాములకు బలమైన హక్కును కల్పించడంలో మరియు వివాదాలను నివారించడంలో భాగంగా వ్యవసాయ భూములపై ​​పన్ను విధించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

 

దీనిపై రెవెన్యూ శాఖ ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించింది, కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి అనుమతి అనంతరం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు దశాబ్దాల క్రితం కరణం, మున్సిఫ్ వ్యవస్థను రద్దు చేసింది. కరణం మరియు మునిసిఫ్ గ్రామపెద్దలుగా ఉండేవారు. ముఖ్యంగా, భూమి రికార్డులను నిర్వహించే బాధ్యత వారిపై ఉండేది. వీరు మొత్తం భూ లావాదేవీలను సమీక్షించేవారు మరియు భూ యజమానుల నుండి పన్నులు వసూలు చేసేవారు.

 

కరణం మున్సిఫ్ వ్యవస్థ అమల్లో ఉన్న సమయంలో భూరికార్డుల నిర్వహణ అత్యంత సమర్థంగా జరిగేదని, ఎలాంటి భూ వివాదాలు ఉండేవి కావని రెవిన్యూ మంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రెవెన్యూ భూ రికార్డుల వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించింది మరియు భూ వివాదాలను సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఈ వ్యవస్థను వేరే రూపంలో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 

 

కొత్త వ్యవస్థ ప్రకారం, గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ కరణం మరియు మునిసిఫ్ తరహాలో తమ విధులను నిర్వర్తించనున్నారు. గ్రామ సర్వేయర్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి భూ యజమానుల జాబితా మరియు క్షేత్రస్థాయి పటాలతో సహా మొత్తం భూ రికార్డులను తమ బాధ్యతగా నిర్వహించాలి. ప్రతి కొత్త భూ అమ్మకపు లావాదేవీలు గ్రామ సచివాలయంలో నమోదు చేయబడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: