మహిళలకుదేశంలో రక్షణ లేకుండా పోతున్నది.  ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ దాడులు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఇలా జరుగుతున్నాయి.  ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా... ఒక్కటి కూడా సరిగా అమలు జరగడం లేదు అన్నది వాస్తవం.  మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.. ఎలా చేయాలి.  ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి.  
నిత్యం రోజుకొక సంఘటన జరుగుతూనే ఉన్నది.  అవేర్నెస్ పెంచాలని అంటున్నారు.  కానీ, ఆ అవేర్నెస్ ఎంతవరకు పనికి వస్తున్నది.  అవేర్నెస్ కోసం మనిషి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా.. కుదరడం లేదు.  అవేర్నెస్ తీసుకురావాలని అనుకుంటున్నా సాధ్యం కావడం లేదు.  అవేర్నెస్ తీసుకురావాలి అంటే అది మాటలు విషయం కాదు.  చదువుకున్న, పెద్ద పెద్ద వాళ్లలో ఇలాంటివి జరగడం  లేదు అంటున్నారు.  మరి శనివారం సాయంత్రం సమయంలో నిజాంపేటలో ఏం జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై మరో సహోద్యోగి అత్యాచారం చేయడాన్ని ఏమంటారు.  
అతను చదువుకోలేదా.. ఆ చదువంతా ఏమైంది.. ఎక్కడికి పోయింది.  చదువు వాళ్లకు ఏం నేర్పింది.  ఇదేనా నేర్పింది.  చదువుకున్న వ్యక్తులు ఇలానే ప్రవర్తిస్తున్నారు.  చదువుకొని వ్యక్తులు కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు.  అలా ప్రవర్తించడం వలన కలిగే నష్టం ఆడవాళ్లకే తప్పించి మగవాళ్లకు కాదు.  ఆ విషయం అందరికి తెలుసు.  ఇక ఇదిలా ఉంటె, దిశ(ప్రియాంక రెడ్డి) కేసు మరిచిపోకముందే... మేడ్చల్ జిల్లా మల్లంపేట- బొల్లారం సరిహద్దులో ఓ మహిళా అస్థిపంజరం కనిపించింది.  
కాలువలో పడిఉన్న ఆ అస్తిపంజరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి అస్తిపంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు.  దాదాపుగా నెల రోజుల క్రితం మరణించినట్టుగా పోలీసులు చెప్తున్నారు.  అస్తిపంజరాన్ని బట్టి మహిళ వయసు 40నుంచి 45 సంవత్సరాలుగా ఉండొచ్చని అంటున్నారు.  ఫోర్స్ నిక్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపిస్తున్నారు.  అక్కడి నుంచి అన్ని వివరాలు బయటకు వస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: