హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ లో వైద్యురాలు దిశా  హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం  చేసి హత్య చేసిన ఘటన... దేశవ్యాప్తంగా ఎంతో మందిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశం మొత్తం వి వాంట్ జస్టిస్ అంటూ నిరసనలు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులను కఠిన శిక్ష పడాలంటూ  డిమాండ్  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ మొత్తం షాద్నగర్ మృతురాలికి న్యాయం చేయాలంటూ దద్దరిల్లుతోంది. 

 

 

 

 దిశ రేప్ ఘటనపై  రాజ్యసభలో చర్చ జరుగుతోంది. దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను  మార్చాలంటూ పార్లమెంట్ సభ్యులు కోరుతున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఘటనపై కన్నీరు పెట్టుకున్నారు అన్నాడిఎంకె ఎంపీ . ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు  కఠిన శిక్ష పడాలి అంటూ డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఎంపీ గులామ్ నబీ  ఆజాద్ షాద్ నగర్ దిశా ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు మాత్రం ఆగలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను మార్చాలంటూ ఆజాద్  అన్నారు. పార్లమెంటు సభ్యులందరూ దిశ రేప్ ఘటనలో నిందితులకు  ఎట్టి పరిస్థితుల్లో శిక్షలు పడేలా చూసి...  మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అంటూ కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోసారి ఆడపిల్లను రేప్  చేయడానికి భయపడేలా నిందితులకు  శిక్ష విధించాలని  దేశ ప్రజానీకం కోరుతోంది.

 

 

 

 భారతదేశంలో మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండటం దేశానికి మాయని మచ్చ లాంటిదని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇదిలా ఉండగా దిశ రేప్ ఘటన ప్రస్తుతం దేశ ప్రజలందరినీ కలిగించివేస్తుంది . దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత దేశ ప్రజలందరికీ చేరిన ఘటన దిశా ఘటనే . దీంతో దిశా ఘటనపై  దేశంలోని రాజకీయ సినీ ప్రముఖులు అందరు స్పందిస్తూ నిందితులకు కఠినంగా శిక్షపడేలా చూడాలంటు  కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: