ఒక ప్రాణికి జన్మ ఇవ్వాలంటే తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అంతే కాకుండా 9 నెలలు అన్ని బాధలు భరిస్తూ ఆ పిండాన్ని మోయాలి. అలా పుట్టిన పిల్లల్ని కాకులు, గద్దలు ఎత్తుకుపోకుండా కంటికి రెప్పలా కాపాడాలి. వారు పెరిగాక జనారణ్యంలో ఉన్న మృగాల భారిన పడకుండా రక్షించాలి. పెళ్లియీడు వచ్చాక కట్టుకున్న వాడు మంచివాడైతే పర్వాలేదు. కానీ వాడు అవివేకుడై మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయిని నానా బాధలు పెడితే అప్పటికీ ఆడపిల్లల కష్టాలు తీరవు. ఇప్పుడు ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవి.

 

 

దీనికి తగ్గట్టుగానే సమాజం రాక్షంగా మారింది అందుకు ఈ మద్యకాలంలో మగమృగాలు ఆడపిల్లలను చెరబడుతున్న తీరే నిదర్శనం. ఇకపోతే పార్లమెంట్‌లో ఓ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ తండ్రితాలూకూ బాధ కనిపించింది. ఓ మానవత్వం ఉన్న వ్యక్తి ఆవేదన కనిపించింది అదేమంటే షాద్‌నగర్ నిర్భయ ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్రంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు.

 

 

మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా లోపాలున్నాయన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే... తమ పరిధి కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం కోర్టులు, చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. ఈ పరిస్థితిపై మార్పు రావడానికి సమాజం అంతా కృషి చేయాలని, ఇలాంటి కేసుల్లో బాధితులకు సత్వరమే న్యాయం లభించాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

 

 

ఇదే కాకుండా పిల్లల్లో నైతిక విలువల్ని తల్లిదండ్రులు పెంపొందించాలన్నారు. సామాజిక చైతన్యంతోనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. ఇకపోతే అంతకుముందు రాజ్యసభలో చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మహిళా ఎంపీలు ఈ ఘటన పై మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. బాధితకుటుంబానికి న్యాయం చేసి... నిందితులకు కఠిన శిక్ష అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: