ఓవైపు దేశమంతా దిశ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. అదే ఘటనకు కొద్దిప్రాంతంలోనే జరిగిన మరో దారుణం గురించి మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. దిశ శవం దొరికిన ప్రాంతంలోనే అక్కడికి కేవలం కొద్ది దూరంలోనే మరో మహిళ శవం కాలిపోతూ కనిపించింది. ఈ కేసు దర్యాప్తు మాత్రం పెద్దగా ముందుకు సాగడం లేదు.

 

మృతురాలిని ధూల్‌పేటకు చెందిన మహిళగా గుర్తించారు. ఆదివారం ధూల్‌పేట్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నెల 29 మధ్యాహ్నం 1 గంటల సమయంలో మంగళ్‌హాట్‌ డివిజన్‌ బంగ్లాదేశ్‌ గల్లీలోని ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లింది. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఆ తర్వాత పురానాఫూల్‌ వైపు నడుచుకుంటూ వెళ్లిన ఫుటేజ్‌లను కూడా సేకరించారు.

 

ఆ మహిళను ఎవరైనా అనుసరించారా అని పరిశీలించారు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు కనిపిస్తోంది. మహిళ ఇంటినుంచి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్లినట్టు సీసీ ఫుటేజీల్లో కనిపిస్తోంది. కానీ.. సిద్దుల గుట్ట ప్రాంతంలో సీసీ ఫుటేజ్ గమనించినప్పుడు మాత్రం ఆమె చేతిలో ఓ సంచి కనిపించింది. ఈ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఇప్పుడు ఈ సంచి గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

 

 

ఆ సంచి గుట్టువీడితే ఈ కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది. మధ్యలో సంచి ఎలా వచ్చింది. ఒక వేళ ఆమె కొనుక్కుంటే ఆ సంచిలో ఏమి ఉండి ఉంటుంది.. ఏమి కొని ఉంటుంది. ఆ తర్వాత ఘటన స్థలంలో ఆ సంచీ ఆనవాళ్లు కనిపించలేదు. మరి శవంతో పాటే ఆ సంచీ కూడా కాలిపోయింది. అసలు ఆ సంచిలో ఏముందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ చిక్కు ముడి వీడితే కానీ..ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: