ప్రస్తుతం పార్లమెంటు ప్రియాంక రెడ్డి రేప్ కేసు పై అట్టుడికిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. జాతీయ నాయకులంతా వెంటనే దీనిపై ఒక పరిష్కారం చూడాలని లేకపోతే మన దేశంలో సంచరిస్తున్న మానవమృగాలు రాబోయే రోజుల్లో ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ఈ చేతగాని చట్టాల సంస్కృతికి ఇంక చరమగీతం పాడే సమయం వచ్చేసిందని ఇక ఇటువంటి పనులు చేయాలంటేనే భయపడే వాతావరణం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇలా రాజకీయ నాయకులంతా అవకాశం వచ్చినప్పుడల్లా రేపిస్టులకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అంటుండగా వెంకయ్యనాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 


ఈ ఉదంతం గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇది సమాజానికి మరియు మానవతా విలువలు కి చాలా అవమానకరమైన రోజని, మరియు దీని కోసం ఒక కొత్త బిల్లు రావాల్సిన అవసరం లేదని రాజకీయ పరంగా పటిమ దృక్పథం తోనే  ఇది సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటప్పుడు మనం మొగ్గలోనే తుంచకుండా ఇన్ని రోజులు జాప్యం చేయడం మన తప్పని.... ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఆయన అన్నాడు. అయితే ఆయన మాట్లాడుతూ ఇప్పుడు చేసిన తప్పు వారందరి పట్ల జాలి చూపించమని.... తర్వాత చేయబోయే వారు కూడా భయపడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నాడు.

 

 

ఇకపోతే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక విషయంలో జరిగినది మొత్తం భారతదేశాన్ని కలిచివేసింది. ఆమె అత్యాచారం విషయంలో బయటికి ఒక్కొక్కటిగా వెలువడుతున్న విషయాలు వింటుంటే అందరూ ఉద్రేకంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖుల నుంచి ఎన్నో డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో పార్లమెంటు సభ్యులంతా దీనిని ఒక యజ్ఞంలా భావించి సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: