40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అన్నట్లు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నలభైఏళ్ల రాజకీయ జీవితం అనడం వింటూనే ఉంటారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ మొదటి సీఎంగా ఎన్నోకోబడ్డారు. ప్రజలు ఎంతగా నమ్ముతారో ద్వేషిస్తే అంతకు అంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారు.  ఇప్పుడు ఏపిలో అలాగే అయ్యింది..ఒకప్పుడు టీడీపీ అధినేతను ఎంతగా గౌరవించారో..అంతగా విమర్శిస్తున్నారు.  ఇందుకు ఉదాహారణే మొన్నటి అమరావతి యాత్ర.  అమరావతి పనుల తీరును పర్యవీక్షించేందుకు తన టీమ్ తో వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, చీపుర్లు, రాళ్లదాడులు చేశారు.  

 

అమరావతి నిర్మాణం కోసం తమ పంట పొలాలను తీసుకొని అతీ గతీ లేకుండా చేశారని కొంతమంది రైతులు ఆక్రోశం వెల్లగక్కారు.  తన నలభై ఏళ్ల కెరీర్ లో చెప్పులు విసిరించుకునే స్థాయికి దిగజారిపోయారని అధికార పార్టీ నేతలు విమర్శించారు.  ప్రజలకు మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటారని.. చెడు చేస్తే చెప్పులు విసురుతారని ఇప్పటికైనా బాబు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కి మరోసారి ఘోర అవమానం జరిగింది. కర్నూలు పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకున్న రాయలసీమ స్టూడెంట్స్ జేఏసీ. గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వారిని పోలీసు అడ్డుకొని అరెస్ట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన్ను విద్యార్థి, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి.ఆందోళనకారులు కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల పాటూ పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు పార్టీ బలోపేతంతో పాటూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.  అయితే కొద్దిరోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడించారు. దాదాపు రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ నిరసన సెగ చంద్రబాబుకు తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: