రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు దేశాన్ని వణికించిన దిశ అత్యాచారం, హత్య కేసు గురించి చాలామంది తమ అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న సమాజంలో మనిషిలో మార్పులు రావాలంటే మనిషిని భయపెట్టే శిక్షలు రావాలి అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది తప్పు చేయడానికి భయపడతారు కొంచెం ఆలోచిస్తారు అంటూ చాలామంది దిశ అత్యాచారం, హత్య కేసు గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

 

ఇంత దారుణంగా దేశంలో స్త్రీని గౌరవించే చోట లేత లేత ప్రాయంలో కలిగిన యువకులు ఈ విధంగా పాల్పడటం బట్టి చూస్తే రాబోయే రోజుల్లో దేశంలో ఆడజాతి కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుందని అప్పుడు సమాజం మొత్తం తప్పు దారి పట్టే అవకాశం ఉంటుందని కుటుంబవ్యవస్థ అలాగే ఇంకా చాలా విషయాల్లో మనిషి మృగంలా ప్రవర్తించడం ఖాయమని ఇకనైనా కోర్టులు న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఇటువంటి పనులు చేసే ఆలోచనలు కలిగిన మగ రూపంలో ఉన్న మృగాలకు భయపడే విధంగా ఇటువంటి ఘటనలకు పాల్పడి ప్రస్తుత న్యాయస్థానాల్లో జైల్లో మగ్గుతున్న మృగాలకు ఒకేసారి బయటకు తీసుకు వచ్చి అందరూ చూస్తుండగానే శిక్ష విధిస్తే చాలా బాగుంటుందని సభ్య సమాజంలో మార్పు వస్తుందని సోషల్ మీడియాలో ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై మరియు అదే విధంగా గతంలో ఆడదాని పై అత్యాచారం చేసి జైల్లో సుఖంగా ఉన్న మృగాలపై త్వరగా శిక్ష విధించాలని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పందించారు. దిశ అత్యాచారం, హత్య కేసు గురించి బాబు మాట్లాడారు. అత్యాచారం, హత్యకు పాల్పడిన మానవ మృగాలు సమాజంలో ఉండేందుకు వీలులేదని, ఆ నిందితులకు ఉరే సరైన శిక్ష అని బాబు పేర్కొన్నారు.  నిందితులకు ఉరి శిక్ష వేయాల్సిందే అని బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: