మన దేశంలోనే అత్యధిక రోజులు వాదనలు కొనసాగిన కేసుగా చరిత్ర సృష్టించిన అయోధ్య కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది అని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు రామ మందిరం ట్రస్ట్ వారికి పెద్ద షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు రామమందిరం ట్రస్టుకి అనుకూలంగా అక్కడ గుడి నిర్మించాలని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పగా ముస్లింలు మసీదు కట్టుకునేందుకు వేరేచోట స్ఠలాన్ని కీడా కేటాయించగా దేశంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.

 

కానీ అప్పుడు ముస్లిం ల తరపు వారు తాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ని గౌరవిస్తామని... ఎటువంటి చాలెంజింగ్ పిటీషన్ దాఖలు చేయమని స్పష్టం చేశారు. కానీ వారు ఈ తీర్పుపై తాము సంతృప్తిగా లేమని వెల్లడించారు కూడా. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు పట్ల దేశమంతటా ఒక వర్గం ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయితే దేశం లో ప్రతి చోట ఆయా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు. సరే ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది... ఆ వేడి తగ్గింది అనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ అయోధ్య కేసు తెరమీదికి వచ్చింది.

 

అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జమాతే ఉలేమా ఇ హింద్ పిటిషన్ దాఖలు చేయడంతో కథ అంతా మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ దేశంలోని మెజారిటీ ముస్లింలు రివ్యూ కోరుకుంటున్నారన్న కారణంతో పిటిషన్ వేసినట్లు సమాచారం. అయితే కేసు కొనసాగింపుకు మరియు వాదనలో తమను బలపరిచేలా వీరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి... ఇంకా మీరు ముందుకు కొనసాగుతారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పుడే దిశ రేప్ కేసు తో దేశమంతా అట్టుడికి పోతున్న సమయంలో కొత్తగా ఇప్పుడు అయోధ్య వివాదం మళ్లీ తెర మీదికి రావడం తో దేశంలో రానున్న రోజులు ఆసక్తికరంగా మారనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: