ఆధార్ అక్షరాలు మూడైనా కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు, ప్రభుత్వ సబ్సిడీ సహా ఇతర పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ కావాల్సిందే. ఆధార్ నెంబర్ అందించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆధార్ లేకుంటే గుర్తింపు లేదు. పరదేశం వెళ్లాలంటే వీసా పాస్‌పోర్ట్  మాదిరిగా మనదేశంలో ఆధార్ ముఖ్యమైంది.

 

 

ఇకపోతే ఇది వరకు ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ తో పాటుగా బ్యాంక్ స్టేట్‌మెంట్, డ్రైవింగ్ లైసెన్స్, డేట్ ఆఫ్ బర్త్ వంటి అడ్రస్ ప్రూఫ్స్ వంటివి ఉంటేనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.  ఒకవేళ మీ వద్ద ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోతే? మరి ఎలా ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి ? చాల కష్టం అనే సమాధానం వినిపిస్తుంది. కాని అవేవిలేకుండా ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవచ్చట. అదెలా అంటే ఆధార్ కార్డు ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ ప్రకారం.. ఎలాంటి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్స్ లేకపోతే ఆధార్ కార్డు పొందేందుకు మరో రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

 

 

అవి ఇంట్రడ్యూసర్ ద్వారా లేదంటే కుటుంబ పెద్ద తరుపున ఆధార్ కార్డు పొందొచ్చు. ఇక సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండా ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డులో పేరు ఉంటే చాలు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ పెద్ద ముందుగా సపోర్ట్ డాక్యుమెంట్లతో ఎన్‌రోల్ చేసుకోవాలి. కుటుంబ పెద్ద తర్వాత ఇతర సభ్యులను ఎన్‌రోల్ చేయించవచ్చు. ఇక ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకునేవారు వారితో ఉన్న రిలేషన్‌షిప్ గురించి తెలియజేయాల్సి ఉంటుంది. దీని కోసం కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

 

 

గ్రామ పంచాయితీ జారీ చేసే ఫోటో ఐడెంటిటీ సర్టిఫికెట్, గెజిటెల్ ఆఫీసర్ జారీ చేసే ఫోటోతో కూడిన ఐడెంటిటీ సర్టిఫికెట్, పోస్టల్ డిపార్ట్‌మెంట్ అందించే అడ్రస్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికెట్, రాష్ట్రం లేదా కేంద్రం జారీ చేసే ఫ్యామిలీ డాక్యుమెంట్, బర్త్ సర్టిఫికెట్, పెన్షన్ కార్డు, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు, పీడీఎస్ కార్డు వంటి వాటిల్లో ఏదో ఒకటి ఇవ్వొచ్చు. ఇక మరో విధానాన్ని పరిశీలిస్తే.

 

 

అదే ఇంట్రడ్యూసర్ ద్వారా. యూఐడీఏఐ వెబ్‌సైట్ ప్రకారం.. ఇంట్రడ్యూసర్ కూడా వేరేవారికి ఆధార్ కార్డు ఇప్పించొచ్చు. ఆధార్ ఎన్‌రోల్ సమయంలో ఈయన అప్లికెంట్ దగ్గరే ఉండాలి. ఈయన ఆధార్ ఎన్‌రోల్ ఫామ్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. యూఐడీఏఐ గతవారం ఒక సర్య్కులర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఇంట్రడ్యూసర్ ఒక స్టాండర్డ్ సర్టిఫికెట్‌లో వివరాలు అందించొచ్చు. దీని సర్టిఫికెట్ ఫర్ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ అని పిలుస్తారు. ఈ సర్టిఫికెట్ వాలిడేషన్ 3 నెలల వరకు ఉంటుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: