అదృష్టం బాగోకపోతే అరటిపండు తిన్న పన్ను ఇరుగుతుంది అంటారు. అలాగే అసలే ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీకి ఏది కలిసి రావడం లేదు. ఎలాగోలా పార్టీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో కూడా పార్టీ ఇప్పుడు వీక్ అయిపోయింది. ఓటమి తర్వాత ఎలాగో చాలామంది పార్టీకి దేబ్బేసి వైసీపీ, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. అటు ఓడిపోయిన మరికొంతమంది ఓటమి దెబ్బకు అసలు బయటకు రావడం లేదు. ఇక వైసీపీ అధికారంలోకి రాగానే పోరాటం మొదలుపెట్టిన అధినేత చంద్రబాబు ఏం చేసిన ఫలితం రావడం లేదు.

 

ఇలా అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకి గెలిచిన స్థానాల్లో వీక్ అయిపోవడం మరింత కష్టాల్లో పడేసినట్లు అయిపోయింది.  మొన్న ఎన్నికల్లో టీడీపీ 23 చోట్ల విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ 23 స్థానాల్లో టీడీపీ చేతి నుంచి మొదట జారిపోయింది గన్నవరం. ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపు వెళ్లడంతో నియోజకవర్గంలో టీడీపీని ఆదుకునే నాయకుడు లేకుండా పోయాడు. ఒకవేళ ఇక్కడ ఉపఎన్నిక జరిగిన వైసీపీ సులువుగా గెలుస్తుంది.

 

ఇక గన్నవరం పక్కనబెడితే విశాఖ నగరంలో టీడీపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు అక్కడ కూడా టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. విశాఖ తూర్పు మినహా ఉత్తర, దక్షిణ, పశ్చిమ స్థానాల్లో టీడీపీ బలం తగ్గిపోయింది. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు పార్టీ మారితే మరిన్ని ఇబ్బందులు తప్పవు.

 

అటు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పరిస్తితి అంత బాగోలేదని తెలుస్తోంది. అధికారం లేకపోవడంతో ఇక్కడ పనులు ఏం జరగడం లేదని తెలుస్తోంది. ఇటు తూర్పు జిల్లాలో పెద్దాపురంలో కూడా టీడీపీకి అనుకూలంగా ఏమి లేదు. అలాగే ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో మెరుగ్గా ఉన్న చీరాలలో పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. ఇక బాలకృష్ణ సినిమాల్లోనే బిజీగా ఉండటంతో కంచుకోట హిందూపురంలో కూడా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: