2019 ఎన్నికలు ఫలితాలు వచ్చి ఆరు నెలలు దాటిందో లేదో గానీ...జనం అప్పుడే 2024 ఎన్నికలు గురించి కూడా చర్చలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. జగన్ పాలన ఆరు నెలల పాలన చూసే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లో 2024లో కూడా అధికార పీఠం జగన్ కే దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా అంచనా వేసుకోవడానికి కారణాలు అనేకమే ఉన్నాయి. మొదట జగన్ ఆరు నెలల పాలన పట్ల ప్రజలు పాజిటివ్ గానే ఉన్నారు. మొదట్లో కొన్ని ఇబ్బందులు వల్ల వ్యతిరేకిత వచ్చిన, ఆ ఇబ్బందులని కూడా అధిగమించి జగన్ దూసుకుపోతున్నారు.

 

ముఖ్యంగా జగన్ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు బాగా రీచ్ అయ్యాయి. ఈ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చేరువ కావడంతో వారు జగన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల యువత అధికశాతం జగన్ వైపు వచ్చేశారు. కాకపోతే సంక్షేమ పథకాలు బాగున్న సరైన అభివృద్ధి జరగకపోవడం వల్ల కొందరు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.

 

కానీ ఇంకా నాలుగున్నరేళ్లు ఉండటంతో అభివృద్ధి కచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ లోటు కూడా ఉండకపోవచ్చు. అయితే వైసీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకిత ఉన్న దాన్ని క్యాష్ చేసుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఎన్నికల తర్వాత ఇంకా ఇబ్బందుల్లో పడిపోయింది. ముఖ్యంగా ఆ పార్టీని చాలామంది నేతలు వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాగే ఓడిపోయిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇంకా కోలుకోలేదు. వీటికంటే మించి అధినేత చంద్రబాబుకు వయసు మీదపడుతుండటం, లోకేశ్ సమర్ధత తక్కువ ఉండటం కూడా పార్టీకి మైనస్ గా మారింది.

 

ప్రస్తుత పరిస్తితులని చూస్తుంటే టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతూనే ఉంది తప్ప మెరుగు పడటం లేదు. అందుకే చంద్రబాబు ఏమన్నా పోరాటాలు చేసిన అవికూడా పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఈ విధంగా మొత్తం పరిస్తితులని అంచనా వేసుకుని రాబోయే 2024ఎన్నికల్లో జగన్ మళ్ళీ సీఎం అవుతారని చర్చ వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: