ఇక్కడ విమర్శించడం అని కాదు గాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎప్పుడు ఆయన సేఫ్ జోన్ లో ఉంచుకునే న‌డుస్తూ ఉంటుంది. ఆయన ఉన్న పార్టీలు బలంగా ఉంటేనే ఆయన వెళ్లి అక్కడ పదవులు ఆశిస్తూ ఉంటారు... తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో గంటా ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యారు, ఇక అక్కడి నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో గంటా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీకి భవిష్యత్తు లేకపోవడంతో తెలుగుదేశంలోకి వచ్చారు.



ఇక్కడ చంద్రబాబు కూడా ఆయన్ను గుర్తించారు. మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అయితే ఇప్పుడు టీడీపీ ఘోర‌మైన స్థితిలో ఉంది. అస‌లు ఆ పార్టీకి భ‌విష్య‌త్తు ఉందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. గంటా ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో బిజెపిలో జాయిన్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.ఇక ఈయన పోతు పోతు ఆ పార్టీలో ఆయన సొంత జిల్లాలో... చిచ్చు పెట్టి పోతున్నారని అంటున్నారు. పార్టీలో కాపు సామాజిక వర్గం బలంగా ఉంది.


ఈ క్ర‌మంలోనే వాళ్ళను కూడా బిజెపిలోకి రమ్మని గంటా కోరారు వారిలో కొంత మంది అయిష్టం గా మాట్లాడటంతో గంటా వర్గం ఇప్పుడు చాడీలు చెప్పే కార్యక్రమం స్టార్ట్‌ చేసినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చేసిన పనుల మీద అధికార పార్టీ నేతలకు గంటా వర్గం ఫిర్యాదు చేసింది. ఇక ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టె వరకు పరిస్థితి వెళ్ళింది.



ఈ జాబితాలో కొంత మంది సీనియర్ నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే మీద కూడా గంటా వర్గం ఫిర్యాదు చేసిందని సమాచారం. దీనితో ఇప్పుడు ఆయా నేతలు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతున్నారు. తన బలం నిరూపించుకోవడానికి తమను బలి చేస్తున్నారని వారందరూ చంద్రబాబుకి ఫిర్యాదు చేశారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: