హైదరాబాద్ అత్యాచారం, హత్య కేసు మరియు దేశంలో ఇటువంటి  సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు మరణ శిక్ష వంటి కఠిన శిక్షలు  సోమవారం రాజ్యసభ  చర్చల్లో భాగంగా  వున్నాయి. హైదరాబాద్‌లో పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి  సామూహిక అత్యాచారం మరియు హత్యపై వాయిదా తీర్మానాలను ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తిరస్కరించారు, అయితే దేశంలో మరెక్కడా  ఇటువంటి  సంఘటనలు జరగకుండా  సంక్షిప్త ప్రస్తావనలు ఇవ్వడానికి సభ్యులను అనుమతించారు. 

 

 

 

పార్టీలకు అతీతంగా  ఇటీవల మహిళల పై జరుగుతున్నా నేరాలను  రాజ్య సభ సభ్యులు  ఖండించారు మరియు నిర్ణీత కాలపరిమితిలో దోషులను కఠినంగా  శిక్షించే  చట్టాలను తేవాలని  డిమాండ్ చేశారు.  హైదరాబాద్ సంఘటన మానవాళికి అవమానకరమని నాయుడు అభివర్ణించగా, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ఈ సమస్యను  మూలం నుండి  పాలద్రోలాలని  , దోషులకు మతం, కులం అనే వివక్ష లేకుండా కఠినమైన శిక్ష విధించాలని పేర్కొన్నారు.

 

 

 

హైదరాబాద్ ప్రాంతానికి చెందిన భద్రతా సిబ్బంది ఈ నేరానికి  బాధ్యత వహించాలని,  రేపిస్టులను బహిరంగంగా బయటకు తీసుకువచ్చి చంపాలి  అని సమాజ్ వాదీ పార్టీ ఎంపి జయ బచ్చన్ రాజ్యసభలో సభ ముకంగా పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాత రేపిస్ట్ నేరస్తులు జైలు నుండి విడుదలయ్యాక వారి పై నిఘా పెట్టాలని, శాస్త్ర చికిత్సలు ఈ నేరస్తులకు చేయాలనీ మరియు రేపిస్టుల జాబితా బహిరంగ పరచాలని డిఎంకే ఎంపి పి విల్సన్ అభిప్రాయం పడ్డరు. 

 

 

 

నిందితులకు  మత  పరమైన రంగు ఇవ్వకూడదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో ఇటువంటి కేసులు విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపి మొహమ్మద్ అలీ  ఖాన్ పేర్కొన్నారు.  ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ఇటువంటి కేసులు నిర్ణిత కల వ్యవధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారణ జరపాలన్నారు. ఇలాంటి దారుణమైన నేరాలకు మరణ శిక్ష వేయాలని  బిజెడికి చెందిన అమర్ పట్నాయక్ డిమాండ్ చేశారు.  సిపిఐ (ఎం) కు చెందిన టి కే  రంగరాజన్ మాట్లాడుతూ, ఇటువంటి నేరాలను అరికట్టడానికి చట్టాలు రూపొందించబడటం లేదని, ఎండిఎంకెకు చెందిన వైకో ఇలాంటి నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దోషులకు కఠినమైన  శిక్ష వేయడానికి  బలమైన చర్యలు తీసుకోవాలని టిఎంసికి చెందిన సంతను సేన్ కోరారు.

 

 

 

కనకమెదల రవీంద్ర కుమార్ (టిడిపి) పోలీసులు ఈ సంఘటన పై అలసత్వాన్ని ప్రదర్శించారు మరియు రేపిస్టులని  ప్రజల మధ్య ఉరి తీయాలని పేర్కొన్నారు. బిజెపి కి చెందిన ఆర్.కె. సిన్హా 2012 ఢిల్లీ లో జరిగిన సామూహిక అత్యాచారం మరియు హత్య కేసులో అప్పీళ్ల కారణంగా నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని గుర్తు చేసారు.  అత్యాచారం కేసులపై సత్వర  విచారణ జరపాలని, ఇలాంటి సంఘటనలకు ఆజ్యం పోసే మాదకద్రవ్యాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని విజిలా సత్యనాంత్ (ఎఐఎమ్‌డికె) డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: