గృహ అవసరాల కోసం నిత్యం వినియోగించే వంటగ్యాస్‌ ధర మళ్లీ పెరిగింది. నాలుగు నెలలుగా ధర పైపైకి వెళ్తుండగా ఈ నెల కూడా సిలిండర్ ధరలు మళ్ళి పెరిగాయి. తాజాగా నాన్ సబ్సిడీ సిలిండర్ ధర 13.50 రూపాయలు పెరిగింది. ఇక ఢిల్లీలో కూడా 14. 2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 695 కు చేరగా, ముంబైలో 665 రూపాయలు, చెన్నైలో 714 రూపాయలు, కోల్ కతాలో 725 రూపాయలు, హైదరాబాద్ లో 748 రూపాయలకు చేరాయి. 

                                

అయితే అన్ని మెట్రో సిటీల కంటే మన హైదరాబాద్ లోనే ఎక్కువ ధర ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎల్పీజీ ధరలకు అనుగుణంగా మన దేశంలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. తాజా పెంపుతో కేవలం నాలుగు నెలల్లో రూ.105.50 పెరిగినట్లయింది. 

                    

అయితే పెరిగిన ధరకు తగట్టుగా సిలిండర్‌పై సబ్సిడీ జమ కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో సబ్సిడీ సిలిండర్‌ వినియోగదారులపై నయా పైసా అదనపు భారం ఉండదు. గృహ వినియోగదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్‌ తీసుకుంటే వారికి వచ్చే సబ్సిడీ తర్వాత బ్యాంక్‌ ఖాతాలో జమవుతున్న విషయం తెలిసిందే.  

               

ఏది ఏమైనప్పటికి ఒకటో తారీఖు వచ్చింది అంటే భయపడే రోజులు వచ్చాయి. ఒకవైపు బ్యాంకుల చార్జీల బాదుడు.. మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలు విలవిలాడుతున్నారు. అయితే ఇప్పటికే ఉల్లికన్నీరు పెట్టిస్తుంటే ఉల్లికి తోడు వంట గ్యాస్ ధర కూడా తోడైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: