తెలుగు భాషపై ఉన్న ప్రేమతో పవన్ కల్యాణ్ కొన్ని కీలక వాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలో తెలుగు భాషపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సొంత తెలుగు చిత్ర పరిశ్రమపై విమర్శలు చేసాడు. తెలుగు హీరోలు చాలామందికి తెలుగు చదవటం, రాయటం రాదని ఆరోపించాడు. అంతేకాదు.. రచయితలకు కూడా తెలుగు భాషపై పట్టు లేదని తీవ్ర విమర్శలు చేసాడు. దీంతో ఈ వాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 

 

 

నిజానికి పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలుగు భాషా పరిరక్షణకు పవన్ గతంలో చేసిందేమీ లేదు. టీడీపీ హయాంలో మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అప్పుడూ తీవ్ర విమర్శలొచ్చినా అప్పటి ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. దానిపై పవన్ టీడీపీని ప్రశ్నించలేదు.. ఇంత హడావిడీ చేయలేదు. తమిళనాడులో తెలుగు మాధ్యమం తీసేసి తమిళం తప్పనిసరి చేశారు. తెలుగును కొనసాగించాలని ఆనాడు బాషా వేత్తలు గళమెత్తినా పవన్ మాత్రం కిమ్మనలేదు. సినిమాలకే వస్తే తెలుగు ప్రాధాన్యంపై పవన్ సినిమా ఏం చేయలేదు. తన సినిమాల్లో హిందీ, ఇంగ్లీష్ పాటలు కూడా పెట్టుకున్నాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోని పవన్ ఇప్పుడెందుకు యాగీ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.

 

 

పవన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే ఈ వాఖ్యలు చేశాడా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వంపై.. నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ పై పవన్ నిరసన గళం ఎత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిసారీ నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఏకంగా సొంత చిత్ర పరిశ్రమపైనే  గురిపెట్టాడు. దీనిపై తెలుగు సినీ రచయితల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఏమైనా.. తెలుగు రచనలు చేసే రచయితలను కూడా ఇలా బయటకి లాగడం పవన్ కు తగదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: