ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ ఘటన పై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు పెల్లుబిక్కాయి. నిర్భయ ఘటన తర్వాత దారుణాతి దారుణమైన ఘటన జరగడంతో దేశ ప్రజలంతా దీని పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను నిలదీశారు. చట్టాలను మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే బాధితురాలు దిశ కుటుంబాన్ని రాజకీయ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటన పై అధికారికంగా స్పందించలేదు. బాధితురాలి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఆర్టీసి ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాత్రం ఈ ఘటన పై మాట్లాడుతూ  ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ నిర్వహిస్తామని తెలిపారు.

 

కానీ నేషనల్ మీడియా సీఎం కేసీఆర్ వ్యవహారాన్ని తప్పు పట్టింది. ఇంతటి దారుణమైన సంఘటన జరిగితే సీఎం స్పందించకపోవడం మరియు కుటుంబాన్ని పరామర్శించకపోవడం పై తీవ్రంగా స్పందించడం జరిగింది. కేసీఆర్ ఎక్కడా? అంటూ పెద్ద చర్చలే నిర్వహించారు అంటే నమ్మండి. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఓ ప్రముఖుని ఇంట్లో జరిగే వివాహానికి హాజరు కావడంతో పాటు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ హాజరు అవ్వబోతున్నారు.

 

ఈ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ ను జాతీయ మీడియా జర్నలిస్టులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వకుండా ముందుకు కదిలారు. బాధితురాలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? బాధితురాలి తరపున స్పందించకుండా ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతారా? అంటూ జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో సీఎం కేసీఆర్ సమాధానమివ్వకుండా మౌనంగా ముందుకు కదిలారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీనిని నేషనల్ మీడియా కూడా ప్రముఖంగా ప్రసారం చేసింది. ఏదేమైనా సీఎం కేసీఆర్ తీరు మరోసారి చర్చనీయాంశమైంది. మరో వైపు తెలుగు మీడియా చేయాల్సిన పనిని జాతీయ మీడియా చేయడంతో యావత్ ప్రజానీకం జాతీయ మీడియాను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: