తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యాచారం ఘటనలో తెలంగాణ పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి . తమ పరిధిలోకి రాదంటూ పలు పోలీస్ స్టేషన్లకు తమను తిప్పారంటూ దిశ తల్లిదండ్రులు చెప్పారు . . దీంతో అంతర్గత విచారణ చేసిన తెలంగాణ పోలీసు శాఖ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది.  

 

ఈ విషయం లో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రేంజీల డీఐజీలు, జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు మెమో జారీ చేశామని తెలిపారు. మరి ఈ తరహా విధానాన్ని తెలంగాణ పోలీసులు ఎప్పుడు అమల్లోకి తెస్తారో చూడాలి.

 

ఇక కేసుకు సంబంధించి తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి, విచారణ జరిపి, సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారిని ఐపీసీ166–ఏ ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయడానికి ఆదేశిస్తారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేస్తారు.

 

 మహిళల పై అఘాయిత్యాలను అరికట్టే విషయంలో తెలంగాణ కంటే కూడా ఏపీ చాలా ముందుందనే చెప్పక తప్పదు. ఓ పక్క దిశ ఘటన తో తెలంగాణలో పోలీసుల తీరు పై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతుంటే... అలాంటి పరిస్థితి మన కొద్దన్న రీతిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న  చర్య ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. దిశ ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ - ముంబై నగరాల్లో మాత్రమే అమల్లో ఉన్న జీరో ఎఫ్ఐఆర్ ను ఇఫ్పుడు ఏపీలో అమలు చేసేందుకు జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ లెక్కన చూస్తే.. మహిళల పై అఘాయిత్యాల నివారణలో కేసీఆర్ కంటే తానే ముందున్నట్లుగా జగన్ చెప్పేసినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.దిశ ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: