ఏపీ సీఎం వ్యవహారశైలిపై, ఆయన మంత్రి వర్గంలోని కొందరి ప్రవర్తనపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం ఈ విషయాన్ని బాగా హైలెట్ చేస్తోంది. జగన్ కేవలం ఒక కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఆయన మంత్రివర్గంలో కొందరు మంత్రులు బూతులు మాట్లాడుతూ స్థాయి దిగజారుస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. విశ్వాస ఘాతానికి, విధ్వంసానికి, వికృత చర్యలకు జగన్మోహన్‌ రెడ్డి ఆరు నెలల పాలన కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ర్ట అధ్యక్ష్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు.

 

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్‌, మంత్రుల నోటి నుంచి రోత పుట్టించే భాష మాట్లాడిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కళా ఆవేదన వ్యక్తంచేశారు.

 

నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్‌ అని హామీ ఇచ్చి కీలకమైన పదవుల్లో 82 పదవులు సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారని కళా అన్నారు.
6
నెలల్లో వచ్చిన ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కులం, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

 

కులాలు, మతాలు, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నాయకులు దేవాలయాలను కూల్చివేస్తు,
వక్స్‌భూములను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. ఉత్సవ విగ్రహాల్లా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారే తప్ప ఎక్కడా బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్న పాపానా పోలేదని దుయ్యబట్టారు. జగన్‌ తన సామాజిక వర్గానికే సింహ భాగం అధికారం ఇచ్చుకున్నారని ఆరోపించారు.

 

 

వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలు, అబద్ధాలు, దుష్ప్రచారాలతో పెట్టుబడులు, రుణాలు తరలిపోయే దుస్థితికి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చీ రాగానే ప్రజావేదిక కూల్చి 9 కోట్ల ప్రజాధనం నేలపాలు చేశారని కళా ఆవేదన వ్యక్తంచేశారు. ఉచిత ఇసుకను రద్దు చేసి 125 వృత్తులు, వ్యాపారాలను దెబ్బకొట్టారని దుయ్యబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: