చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి పనుల్లో వేల కోట్లు దోచుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం ఒక్క అసెంబ్లీ బిల్డింగ్ వెయ్యి కోట్లకు పైగా దోచేశారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. రూ.120 కోట్లు అయ్యే దాన్ని రూ.1500 కోట్లకు పెంచారని, ఇందులోనే వెయ్యి కోట్లు దోచేశారని పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు భవనాలు నిర్మించారని, అక్కడ కనీసం టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నట్లు చెప్పారు.

 

చిన్న వర్షం కురిస్తే చాలు చంద్రబాబు కట్టించిన భవనాలు నీరు కారిపోతున్నాయని తెలిపారు. గాలికి జనరేటర్‌ గోడ కూడా కూలిపోయి ఒకరు చనిపోయారని గుర్తు చేశారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి అందులో కూడా డబ్బులు నొక్కేశారని విమర్శించారు. అసైన్డు భూములు 2 వేల ఎకరాలను తక్కువ రేటుకు తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు.

 

చంద్రబాబు రాజధాని పేరుతో చేస్తున్న రాజకీయాలు మానుకోవాలని ఉండవల్లి శ్రీదేవి సూచించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని మోసం చేశారన్నారు. ఆయన చేసిన పనికి ఇటీవల రైతులు రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేశారని గగ్గొలు పెడుతున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవమైనా, నాలుగేళ్ల అనుభవమైనా ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఈ విధంగానే శాస్తి జరుగుతుందని ప్రజలు ఇటీవల తీర్పు ఇచ్చారు.

 

తెనాలి నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చుకుంది టీడీపీ నేతలే అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. ఆ రోజు రాజధాని రైతులు, కూలీలు కడుపు మండి నల్ల జెండాలతో చంద్రబాబుకు నిరసన తెలిపారన్నారు. వారిని ఒక టెర్రలిస్టులుగా చిత్రీకరించారన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత కూడా టీడీపీ నేతల్లో పశ్చాతాపం కలుగడం లేదన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: