దేశవ్యాప్తంగా దిశ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శంషాబాద్ లో దిశ అత్యాచారానికి, హత్యకు కారణమైన నిందితుల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇప్పటివరకు దిశను హత్య చేసిన తరువాత మాత్రమే నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు చెబుతున్నారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ అరీఫ్ జైలులోని సిబ్బందికి చెప్పిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
దిశ హత్య కేసు నిందితులు చర్లపల్లి జైలులో పోలీసుల ప్రత్యేక నిఘాలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అరీఫ్ జైలులోని కొందరు జవాన్లతో మాట్లాడినపుడు దిశ అత్యాచారం, హత్య గురించి కొన్ని కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. అరీఫ్ మిగతా ముగ్గురు నిందితులతో కలిసి సమీప ప్రాంతానికి దిశను లాక్కుని వెళ్తుంటే దిశ రక్షించండంటూ గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. దిశ గట్టిగా అరవటంతో ఆ మాటలు ఎవరికీ వినబడకుండా చెన్నకేశవులు బలవంతంగా దిశ నోట్లో మద్యం పోశాడు. 
 
నిందితుడు మద్యం నోట్లో పోయటంతో దిశ స్పృహ కోల్పోయింది. ఆ తరువాత నిందితులు అత్యాచారం చేశారు. ఆ తరువాత దిశను లారీలోకి ఎక్కించారు. లారీలోకి ఎక్కించి ఆ తరువాత కూడా దిశపై అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ మద్యం తాగడం, అత్యాచారానికి గురి కావడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లిందని నిందితుడు అరీఫ్ చెప్పాడు. నిందితుడు అరీఫ్ దిశ చనిపోయినట్లుగా భావించామని కానీ చనిపోలేదని చెప్పినట్లు సమాచారం. 
 
దిశ బతికి ఉండగానే దిశను చటాన్ పల్లి వంతెన దగ్గరకు తీసుకెళ్లి బతికి ఉన్న దిశపై పెట్రోల్ పోసి చంపేశామని నిందితుడు అరీఫ్ చెప్పినట్లు సమాచారం. దిశ హత్య కేసు నిందితులను రిమాండ్ పై చర్లపల్లి జైలులో పెట్టారు. జడ్జి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: