జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీలో నిజంగానే విలీనం చేస్తారా అనే ప్రశ్న ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తన అన్న బాటలోనే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తారని విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారట. బాబు హయాంలోనే బీజేపీ తో మెరుగైన సంభంధాలు ఉన్నాయని అయితే 2019 ఎన్నికల్లో తప్పకుండా జనసేన కింగ్ మేకర్ అవుతుందని,  దాంతో ఏపీలో తిరుగులేని ప్రధాన పార్టీగా అవతరించచ్చు అనే ఉద్దేశ్యంతో బీజేపీ తో జట్టు కట్టలేదని అంటున్నారు. కానీ

 

2019 ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన జనసేన పార్టీకి ఇప్పుడు కనీసం ఏపీలో బీజేపీకి ఉన్న బలైన కేడర్ కూడా లేదని, గ్రామా స్థాయిలో , మండల స్థాయిలో కూడా పార్టీ ఇప్పటికి కూడా చేరుకోలేక పోయిందని ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ తో జట్టుకట్టక తప్పదనేది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలో తీవ్ర స్థాయిలో చర్చనడుస్తోంది. అంతేకాదు ఇదే విషయంపై కొడాలి నాని పవన్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల్ని  ప్రస్తావించారు కూడా. అమిత్ షా పై పవన్ సానుకూల వ్యాఖ్యలు చేయడం కూడా ఎన్నో అనుమానలకి తావిస్తోంది అంటున్నారు. ఇదిలాఉంటే

 

జనసేనని బీజేపీలో విలీనం చేసే విషయంలో సొంత పార్టీలోని ఓ కీలక వ్యక్తినుంచీ తీవ్ర స్థాయిలో పవన్ పై ఒత్తిడి వస్తోందనేది ప్రస్తుతం జనసేన వర్గాలలో సైతం జోరుగా చర్చకి వస్తోంది. పార్టీ ఘోరఓటమి పాలై  కొంతమంది కీలక వ్యక్తులు జనసేనని వీడన సమయంలో సైతం సదరు వ్యక్తి పవన్ ని విలీనం విషయంలో ఆలోచన చేయమని అడిగారని, ప్రస్తుత పార్టీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విలీన విషయాన్ని  మళ్ళీ పునరాలోచన చేయమని ఒత్తిడి చేస్తున్నారట.  ఈ పరిణామాల నేపధ్యంలోనే పవన్ సైతం బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: