అత్యాంత దారుణంగా....అమాన‌వీయంగా దిశ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన న‌లుగురు నిందితుల విష‌యంలో పోలీసులు, జైలు వ‌ర్గాలు ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. నలుగురు నిందితులు చర్లపల్లి జైలులో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, దిశ అత్యాచారం, హత్యకేసు నిందితుల తీరుతో పోలీసుల్లోనే ఒక‌ర‌క‌మైన భ‌యం పుట్టింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. చర్లపల్లి జైలుతో పాటు షాద్​నగర్​ కోర్టు వద్ద పోలసులు మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించాలని కోరుతూ పోలీసులు షాద్​నగర్​ కోర్టులో కస్టడీ పిటిషన్​ దాఖలు చేయ‌గా... నిందితులను కోర్టు పది రోజుల కస్టడీకి అప్పగించింది.

 

 

కాగా, త‌మ విచార‌ణ‌లో సీన్​ రీకన్​స్ట్రక్షన్​తో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో నిందితులను బుధవారం నుంచి ఈ నెల 12 వరకు కస్టడీకి అనుమతిస్తూ షాద్​నగర్​ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో బయటపడే వివరాలతో నిందితులపై చార్జిషీట్​ ఫైల్​ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, నిందితులపై ప్రజాగ్రహం తీవ్రంగా ఉండడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిచేస్తున్నారు. అంతేకాకుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకొని చర్లపల్లి జైలులో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను రహస్యంగా విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

 

 

పెద్ద ఎత్తున ప్ర‌జాగ్ర‌హం ఉన్న నేప‌థ్యంలో లా అండ్​ ఆర్డర్​ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్, రాచకొండ సీపీలు సజ్జనార్, మహేశ్​ భగవత్​ఉన్నతాధికారులతో చర్చించారు. నిందితులను ఎక్కడ విచారించాలనే విషయాన్నీ పరిశీలించారు. ఎక్కడికి తరలించినా సమస్యలు తప్పకపోవచ్చనే సందేహంతో నిందితులను జైల్లోనే విచారించే అవకాశాలు ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది.ఇప్ప‌టికే  నిందితుల ఐడీ పరేడ్ కూడా సీక్రెట్​గా పూర్తిచేశారు. మ‌రోవైపు, నలుగురు నిందితులు కలిస్తే కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని విడివిడిగా విచారించడం వల్ల ప్రాసిక్యూషన్​కు బలమైన సాక్ష్యాలు దొరుకుతాయని భావిస్తున్నారు. అందుకే, జైలులో నిందితులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా నలుగురినీ వేర్వేరు బ్యారెక్‌​లలో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: