తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల స్థానిక మీడియా సానుకూల వైఖరి ప్రదర్శిస్తుండగా , జాతీయ మీడియా మాత్రం దుమ్ము దులుపుతోంది . దిశ హత్యాచార ఘటన పై ఆలస్యంగా స్పందించడం పట్ల జాతీయ మీడియా కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తోంది . దిశ హత్యాచార ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి హోదా లో కేసీఆర్, స్పందించకపోవడాన్ని స్థానిక మీడియా అసలు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కానీ జాతీయ మీడియా మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గానే పరిగణిస్తూ ... చర్చా గోష్టి లో అధికార టీఆరెస్ ఎంపీ జితేందర్ రెడ్డి ని తీవ్ర స్థాయి లో ప్రశ్నించడమే కాకుండా , కేసీఆర్ వైఖరి పై సదరు ఛానెల్ ప్రతినిధి  మండిపడ్డారు .

 

 ఇక దిశ కుటుంబాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించగా , కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఢిల్లీ లో రాజీవ్ శర్మ కుమారుడి  వివాహ వేడుకకు  హాజరయిన కేసీఆర్ ను  జాతీయ మీడియా ప్రతినిధులు ఇదే విషయమై నిలదీశారు . దిశ హత్యాచార ఘటన పై ఎందుకు స్పందించలేదని  ప్రశ్నించడమే కాకుండా , ఈ విషయం పై  మాట్లాడకుండా మౌనం మౌనం వహిస్తూ మాట్లాడకుండా వెళ్లిపోయిన  కేసీఆర్ వైఖరి పట్ల ఆగ్రహాన్ని ప్రదర్శించారు  .

 

దేశ వ్యాప్తంగా దిశ ఘటన పట్ల అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలి లో స్పందిస్తుండగా , కేసీఆర్ మాత్రం ఆలస్యంగా స్పందించడమే కాకుండా, దిశ కుటుంబాన్ని పరామర్శించకుండా  వరుసగా వివాహ వివాహ వేడుకలకు హాజరుకావడాన్ని జాతీయ మీడియా తప్పుపడుతోంది . అయితే కనీసం ఈ విషయం లో కేసీఆర్ ప్రశ్నించే సాహసాన్ని కూడా స్థానిక మీడియా చేయకపోవడం, వారి చేతకానితనానికి నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: