రాజ్య‌స‌భ స‌భ్యుడు, బీజేపీ నేత ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త సుజానాచౌద‌రి, అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు డీఆర్టీ నోటీసులు అందాయి. ఆయ‌న‌, కుటుంబ స‌భ్యులు   ఐడీబీఐకి రూ. 169 కోట్లు ఎగ‌వేశార‌ని బ్యాంక్ అధికారులు చెన్నైలో డీఆర్టీకి ఫిర్యాదు చేసింది. దీంతో సుజనా కంపెనీలకు  సోమ‌వారం డీఆర్టీ నోటీసులు అందించింది. నోటీసులు అందుకున్న వారిలో సుజనా భార్య పద్మజ, ఎస్టీ ప్రసాద్, ధనలక్ష్మీ , సుజనా క్యాపిటల్ సర్వీసెస్, ఎక్స్‌ప్లేయర్ ఎలక్ట్రికల్స్ ఉన్నారు.  

 

ఈనెల 16వ తేదీన విచారణకు హాజరుకావాలని...లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని నోటీసుల్లో అధికారులు హెచ్చ‌రించారు. ఇక డీఆర్టీ అంటే డిబెట్ రికవరీ ట్రిబ్యునల్. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాలు వసూలు చేసేందుకు డీఆర్టీ ప్రకారం నోటీసులు అందిస్తుంటాయి. గత సంవత్సరం, నవంబరులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రూ .315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విష‌యం తెలిసిందే.  

 

ఇందులో ఆరు లగ్జరీ కార్లు మరియు పత్రాలు ఉన్నాయి. మిస్టర్ చౌదరి నియంత్రణలో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 120 కి పైగా షెల్ కంపెనీలు రూ .6,000 కోట్లకు పైగా బ్యాంక్ మోసం కేసులో ద‌ర్యాప్తులు సాగుతున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) 31 మార్చి 2013 లో భారతదేశ ప్రభుత్వ బ్యాంకుల 400 అగ్ర బ్యాంకు రుణ ఎగవేతదారుల జాబితాను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.  అప్ప‌డు కూడా సుజ‌నా కంపెనీలు ఈ జాబితాలో  ఉన్నాయి.

 

సుజానా గ్రూపులోని రెండు సంస్థలు  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు 920 కోట్ల రూపాయల రుణాలను ఎగవేసాయ‌ని పేర్కొన్నారు. రెండు సంస్థలతో పాటు, సుజనా గ్రూప్ మరొక సంస్థను కూడా నడుపుతుంది - సుజనా మెటల్ ప్రొడక్ట్స్. ఈ మూడింటినీ భారతీయ బోర్స్‌లలో జాబితా చేశారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బీజేపీలో ఆయ‌న కీల‌క నేత‌గా ఉన్నారు. ద‌ర్యాప్తు..చ‌ర్య‌లు ఏవిధంగా ఉండ‌బోతున్నాయ‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: