బిజెపిలో జనసేన పార్టీ విలీనం అయిపోతుందా ? ఇపుడిదే అంశంపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాతే అందరిలోను అనుమానాలు పెరుగుతున్నాయి. పవన్ మాట్లాడుతూ బిజెపిలో జనసేన విలీనం గురించి ఇపుడే ఏం చెప్పలేనని అన్నారు.

 

ఆమధ్య కమలం పార్టీలో జనసేనను విలీనం చేయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అడిగినట్లు పవన్ స్వయంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి పార్టీని నడిపేంత సీన్ పవన్ కు లేదన్నది స్పష్టంగా అర్ధమైపోతోంది. జనసేన ఏర్పాటు చేసింది మొదలు అయితే చంద్రబాబునాయుడు లేకపోతే బిజెపి మీద ఆధారపడే రాజకీయాలు చేస్తున్నారు.

 

తనకంటూ ఏ విషయంలో కూడా స్పష్టమైన అవగాహన లేకపోవటం, ఏ విషయంపైన కూడా సొంత వైఖరి లేకపోవటం పవన్ కు పెద్ద మైనస్ గా మారింది. పైరెండు అవలక్షణాలకు తోడు జగన్మోహన్ రెడ్డిపై పేరుకుపోయిన ధ్వేషం మరింత ప్రమాదకరంగా మారిపోతోంది. అందుకనే బహిరంగసభలు, కార్యకర్తల సమావేశాలు, ట్విట్టర్ లో కూడా ఏం కామెంట్లు పెడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

ఇటువంటి పరిస్ధితుల్లోనే బిజెపిలో జనసేన విలీనం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. పైగా మొన్నటి ఎన్నికల్లో టిడిపి, బిజెపితో కలిసి పోటిచేసుంటే పరిస్ధితులు మరోరకంగా ఉండేదని అనటమే ఆశ్చర్యంగా ఉంది. పై రెండు పార్టీలతో కలిసి పోటి చేయవద్దని పవన్ ను ఎవరు ఆపారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

పవన్ లో ప్రధాన సమస్య ఏమిటంటే  తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటమే కాకుండా జగన్ కన్నా తానే అన్నింట్లోను ఎక్కువ అన్న అహం బాగా పెరిగిపోయింది. అంటే పవన్ ఏదైనా  మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడా ? అని జనాలు అనుమానించేట్లుగా తనంతట తానే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి తొందరలోనే జనసేన దుకాణాన్ని మూసేసి బిజెపిలో విలీనం చేస్తే అందరికీ మంచిదనే అనుకోవాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: