ప్రస్తుతం  రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. బుధవారం పవన్ కళ్యాణ్  వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వరుడి సేవలో పాల్గొనడం జరిగింది. పవన్‌తో పాటూ నాదెండ్ల మనోహర్.. ఇతర పార్టీ నేతలు కూడా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడం నాకు చాల ఆనందంగా ఉందని.. ఇది నా  అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపాడు.

 

 పవన్ కళ్యాణ్ నేను తిరుపతిలో  యోగా భ్యాసం కూడా చేశాను అని తెలిపాడు. ఇక గతంలో కూడా మూడు దశాబ్దాల క్రితం ఈ ఏడుకొండల స్వామి సన్నిధిలో ధర్మో రక్షతి రక్షితః అని నేర్చుకోవడం జరిగింది  అని పవన్ తెలిపాడు. ఇప్పటికీ  కూడా త్రికరణ శుద్ధిగా నేను అదే పాటిస్తు ఉన్నాను అని తెలిపాడు.. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఎల్లపుడు ఉండాలి అని వెంకటేశ్వర్ స్వామి వారిని ప్రార్థించానన్నారు పవన్ కళ్యాణ్.

 

ఇక నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్  రాయలసీమలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ టూర్ కొనసాగుతోంది. ఈ  పర్యటనలో నియోజకవర్గాల వారీగా సమీక్షలతో పాటూ పార్టీ బలోపేతంపై చర్చలు కోన సాగిస్తున్నాడు. అలాగే రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు కూడా జరుగుతున్నాయి అని సమాచారం. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు.. ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు పడుతున్నవారిని కలిసి.. వారి ఇబ్బందుల్ని స్వయంగా తెలుసు కోవడం జరిగింది. ఇక తాజాగా  తిరుపతిలోని రైతు బజారులో పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది. 

 

అక్కడ స్థానికులు, ఉల్లి రైతులు పడుతున్న అన్ని కూడా అడిగి మరీ తెలుసుకోవడం జరిగింది. ఇక మరో వైపు జగన్ సర్కార్ తీరుపై పవన్ మండి పాడడం జరిగింది. ఇక  ఉల్లి సమస్యపై మాట్లాడుతూ.. సబ్సిడీపై ఉల్లిని ప్రజలకు అందజేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ విషయంలో  ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తాము అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: