ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఎన్ని చట్టాలు చేసినా, ఎందరు రాజకీయ నాయకులు మారినా ఇటువంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఇక దిశ ఘటనపై ప్రజలతో సహా రాజకీయ మరియు సినిమా ప్రముఖులు సైతం ఏందో ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు ప్రజా, మహిళా సంఘాల నుండి ప్రభుత్వాలకు నిందితుల శిక్ష పై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. 

 

కొందరైతే అటువంటి వారిని బహిరంగంగా ఉరి తీయాలని, అలా చేస్తేనే ఇకపై ఇటువంటి ఘటనలకు పాల్పడాలనుకునే వారికి ఇది పెద్ద చెంప పెట్టు అవుతుందని అంటున్నారు. ఇక ఈ దారుణ ఘటనపై వర్ధమాన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. రోజులు గడుస్తున్నాయి, మనిషి డిజిటల్ గా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడు, కానీ మానసికంగా మాత్రం రోజురోజుకు ఎందుకింత దిగజారిపోతున్నాడు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళగా ప్రియాంక రెడ్డి ఉదంతాన్ని విన్నపుడు తన కంట కన్నీరు ఆగలేదని, అమ్మాయిలను కనీసం ప్రశాంతంగా కూడా బ్రతకనివ్వరా, 

 

కేవలం కొన్ని క్షణాల పాటు దొరికే సుఖం కోసం నిండు ప్రాణాలు బలి చేస్తారా అంటూ శ్రీరెడ్డి కన్నీరు కారుస్తూ మాట్లాడింది. ఆమెను అత్యంత కిరాతంగా హింసించి అత్యాచారం చేసి, ఆ తరువాత పెట్రోల్ పోసి కాల్చిన చంపిన ఆ దుర్మార్గులను ఏమి చేసినా తక్కువే అని, ఇటువంటి ఘటనలపై ప్రభుత్వాలు ఇకనైనా మేలుకుని భవిష్యత్తులో జరుగకుండా మరింత కఠిన చట్టాలు తీసుకురావాలని శ్రీరెడ్డి కోరింది. ప్రియాంక ఘటనలో తాను ఏడవడం తప్ప మరేమి చేయలేకపోతున్నందకు తనకు ఎంతో బాధగా ఉందని, మరే ఆడపిల్లకు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి రాకూడదని ఆమె మాట్లాడుతూ చెప్పింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: