హీరోలు సినిమాలు చేస్తూనే బిజినెస్ చేస్తుంటారు.  ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపారంలో అడుగుపెట్టాలని ఉంటుంది.  కేవలం సినిమా రంగంలో ఉన్నంత మాత్రనా ఎలాంటి లాభం ఉండదు.  కాబట్టి లాభాలు గట్టిగా రావాలి అంటే తప్పనిసరిగా డబ్బు ఉండాలి.  లాభసాటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి.  అప్పుడే ఏదైనా సరే జరుగుతుంది.  ఏదైనా సరే చేయగలుగుతారు.  


హీరోయిన్లు జ్యువెలరీ, జిమ్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటే, హీరోలు ఉన్న ఇండస్ట్రీలోనే పెట్టుబడులు పెడుతుంటారు.  మహేష్ బాబు, రామ్ చరణ్ లు హీరోగా చేస్తూ, సినిమాలు నిర్మిస్తున్నారు.  మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్మించారు.  ఈ బిజినెస్ ఇప్పుడు బ్రహ్మాండంగా సాగుతున్నది.  ఇప్పుడు ఇదే విధంగా  టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. 


నిను వీడను నీడను నేనే, తెనాలి రామకృష్ణ సినిమాలు వరసగా మంచి విజయం సాధించడంతో.. సందీప్ కిషన్ మంచి జోష్ లో ఉన్నారు.  ఇప్పటికే సందీప్ కిషన్ అరిటాకు భోజనం పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.  ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నది.  ఈ వ్యాపారంతో పాటుగా సందీప్ మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు.  


ఆ వ్యాపారం మరేమిటో కాదు... సెలూన్ బిజినెస్.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ సెలూన్ బిజినెస్ చేయబోతున్నారు.  సెలూన్ బిజినెస్ కోసం భారీగా పెట్టుబడి పెట్టబోతున్నారు.  స్టైలిష్ రంగంలో మంచి పేరున్న క్యుబిఎస్ సెలూన్  ఫ్రాంచైసీని సందీప్ తీసుకోబోతున్నారు.  సందీప్ కిషన్ కు సంబంధించిన ఈ సెలూన్ బిజినెస్ త్వరలోనే ప్రారంభం కాబోతుందిట.  సూపర్ కదా. సెలూన్ బిజినెస్ కు ఇటీవల కాలంలో మంచి గిరాకీ ఉన్నది.  సెలూన్ బిజినెస్ రంగంలో నిత్యం కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతున్నది.  మిగతా వాటితో పోలిస్తే దీనికి పెట్టుబడి పెద్దగా ఉండదు.  కానీ, అన్నింటికంటే లాభాలు ఎక్కువుగా వస్తుంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: