భారత దేశంలో రోజు రోజుకు ఆడవారిపై పెరుగుతున్న అత్యాచార కేసుల్లో ఒక కీలకమైన వినతి ఈ రోజు మన దేశ రాష్ట్ర రాష్ట్రపతికి అందింది. విషయంలోకి వెళితే, 2012 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగిన నిర్భయపై అత్యాచారం హత్య కేసులో దోషులుగా తేలిన ఉరిశిక్ష అమలు చేసేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీం కోర్టు వారికి ఉరి శిక్ష ఖరారు చేసింది. కానీ, వారు రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ అర్జీ పెట్టుకున్నారు.

 

ఒకవేళ ఈ కేసులో రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరిస్తే మరణశిక్షను వెంటనే అమలు చేయాలని జైలు అధికారులు అనుకుంటున్నారు. కానీ జైలు అధికారులకు ఇక్కడో చిక్కుముడి పడింది. వారి దగ్గర ఉరి తీయడానికి తలారి లేకపోవడంతో అధికారులు వారి తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి మన దేశ రాష్టప్రతి కోవింద్ గారికి ఒక లేఖ రాసారు. తనను ఈ కేసులో తాత్కాలిక తలారి గా నియమించాలని ఆ వ్యక్తి కోరారు.

 

 తీహార్ జైలులో నన్ను తాత్కాలిక తలారి గా నన్ను నియమించండి అంటూ ఆయన లేఖ రాశారు సిమ్లా కు చెందిన రవికుమార్. సాధారణంగా మన లాంటి దేశాలలో ఉరి శిక్షలు అమలు పరచడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి తలారులు వీధుల్లో శాశ్వతంగా ఎవరిని తీసుకోవడం లేదు అని చెప్పారు. తీహార్ జైల్లో చివరిసారిగా పార్లమెంట్ దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరి తీశారు. ఆ తర్వాత అక్కడ తలారి అవసరం అనేది రాలేదు. ఇప్పుడు నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేయాల్సి రావడంతో తలారి కోసం అధికారులు వెతుకుతున్నారు. 

 

కానీ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ దోషి యొక్క అభ్యర్ధనను తిరస్కరించాలని రాష్ట్రపతి రామనాధ్  కోవింద్ ను కోరారు. ఒకవేళ రాష్ట్రపతి కనుక క్షమాభిక్షను తిరస్కరిస్తే ఉరిశిక్షను వెంటనే అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: