తనను తానే దేవునిగా  ప్రకటించుకున్న వివాదాస్పదమైన  నిత్యానంద చేత కొత్త దేశం స్థాపించబడింది, దీనిని ‘కైలాసా’ (కైలాసా.ఆర్గ్) అని పిలుస్తారు, కొత్తగా ఏర్పడిన దేశానికి  జెండా, రాజ్యాంగం, చిహ్నం,  ఒక ప్రధానితో పాటు మంత్రివర్గం కూడా  వుంది.

 

 

కర్ణాటక లో  తనపై నమోదైన అత్యాచారం కేసు నుండి తనను తాను రక్షించుకోవడానికి నిత్యానంద పాస్పోర్ట్  లేకుండా భారతదేశం నుండి పారిపోయారు.  ఈ దేశానికి విరాళాలు ఇచ్చి  కైలాసా పౌరసత్వం పొందే అవకాశం ఉందని తద్వార  ఒక  గొప్ప హిందూ దేశం ఏర్పాటు చేయవచ్చని కైలాస.ఆర్గ్   పిలుపు  నిచ్చిందని    వార్తా సంస్థ  ఐఎఎన్ఎస్ నివేదించింది.

 

 

ధృవీకరించని సూత్రాల  ప్రకారం, నిత్యానంద మధ్య లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్‌లో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానిని , ఒక  కొత్త స్వతంత్ర దేశం అని పిలవడం ప్రారంభించినట్లు న్యూస్ 18 నివేదించింది. కైలాసా అనేది సరిహద్దులు లేని దేశం, ప్రపంచవ్యాప్తంగా  తమ దేశాలలో హిందూ మతాన్ని ఆచరించే హక్కును కోల్పోయి బహిష్కరించబడిన హిందువుల కోసం ఈ దేశ ఏర్పాటు చేయబడింది  అని కైలాస.ఆర్గ్  పేర్కొంది.   ఇప్పటికే దీనికి సంబందించిన  నమూనా  ఆన్‌లైన్‌లో  విడుదల చేయబడింది.  'రిషభా ధ్వాజ' అని పిలువబడే జెండా,  శివుడి వాహనం నందితో పాటు నిత్యానంద కూడా కైలాస.ఆర్గ్ వెబ్సైటు  లో కనిపించరు.

 

 

 

కైలాసా విద్య, ఖజానా, వాణిజ్యం మరియు అనేక ప్రభుత్వ విభాగాలను కలిగి ఉంది.  వీటిలో సనతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి కృషి చేసే జ్ఞానోదయ నాగరికత విభాగం   విశిష్టమైనది. ఈ  దేశం  ధార్మిక  ఆర్థిక వ్యవస్థ , హిందూ ఇన్వెస్ట్మెంట్ మరియు రిజర్వు  బ్యాంక్ కలిగి ఉందని కైలాస.ఆర్గ్  పేర్కొంది, ఇక్కడ క్రిప్టోకరెన్సీ కూడా అంగీకరించబడుతుంది.

 

ఈ దేశ పౌరులకు కైలాసా పాస్‌పోర్ట్ ఇవ్వబడుతుంది, ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారికి   కైలాసాతో సహా హిందూ పురాణాలలో గల  మొత్తం పద్నాలుగు లోకాల్లో ఉచిత ప్రవేశం లభిస్తుంది. 2010 లో, ఒక నటితో పడక గదిలో   ఉన్న వీడియో వైరల్ కావడంతో నిత్యానంద వార్తల్లోకి ఎక్కారు. తరువాత అత్యాచారం కేసు లో ఆయనను  అరెస్టు చేశారు.  గత నెలలో, అహ్మదాబాద్ సమీపంలోని తన ఆశ్రమంలో లైంగిక కుంభకోణం మరియు బాలికలపై వేధింపుల ఆరోపణలు బహిరంగమైన తరువాత, గుజరాత్ పోలీసులు నిత్యానంద భారతదేశంలో లేరని కోర్టుకు తెలియజేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: