మామూలుగా కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. టీడీపీ అధికారంలోకి రావడానికి కృష్ణా జిల్లా ఎక్కువ అండగా నిలుస్తుంది. ఒకవేళ అధికారం కోల్పోయిన కృష్ణాలో టీడీపీ ఎప్పుడు బలంగానే ఉంటుంది. అయితే 2019 ఎన్నికల తర్వాత మాత్రం పరిస్తితి పూర్తిగా మారిపోయినట్లు కనబడుతుంది. ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 16 సీట్లకు గాను 2 మాత్రమే గెలుచుకుంది. దీంతో టీడీపీ పరిస్తితి మరింత ఘోరంగా తయారైంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలుగా నియోజకవర్గాలు ఇప్పుడు టీడీపీ చేతి నుంచి జారిపోతున్నట్లు కనబడుతున్నాయి.

 

భవిష్యత్తులో కూడా ఆ స్థానాల్లో టీడీపీ కోలుకోవడం కష్టమే అనిపించేలా పరిస్తితి వచ్చేసింది. అలా ఉన్న నియోజకవర్గాల్లో తిరువూరు, నూజివీడులు ముందు వరుసలో ఉన్నాయి. నూజివీడులో దశాబ్ద కాలంగా టీడీపీకి గెలుపు లేదు. అటు తిరువూరులో గత నాలుగుసార్లు నుంచి టీడీపీకి విజయం దక్కలేదు. తిరువూరులో టీడీపీ 1983, 85, 1994, 99 ఎన్నికల్లో గెలిచింది. ఇక 1989 తర్వాత 2004, 09, 14, 19 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది.

 

మొన్న ఎన్నికల్లో మాజీ మంత్రి జవహర్ పోటీ చేసిన ఇక్కడ టీడీపీకి విజయం రాలేదు. ఇక్కడ వైసీపీ బలంగా పాతుకుపోయింది. ఎమ్మెల్యే రక్షణనిధి కూడా  మంచి పనితీరు కనబరుస్తూ ముందుకెళుతున్నారు. ఇక వరుస ఓటములతో ఇక్కడ టీడీపీ కేడర్ చాలావరకు వైసీపీలోకి షిఫ్ట్ అయిపోయింది. దీంతో భవిష్యత్తులో కూడా ఇక్కడ టీడీపీ విజయం అసాధ్యమనే అనిపిస్తోంది. అటు నూజివీడులో టీడీపీ 1983, 83, 1994, 1999, 2009 ఎన్నికల్లో గెలిచింది.

 

1989, 2004, 2014,2019 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ టీడీపీకి సరైన నాయకుడు లేకపోవడం వల్ల గత రెండు పర్యాయలుగా ఓడిపోతూ వచ్చింది. స్థానికేతరుడు అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరావు బరిలో ఉండటం వల్ల టీడీపీకి విజయం దక్కడం లేదు. ఇక ఓడిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందుబాటులో ఉండని…ముద్దరబోయిన మళ్ళీ గెలవడం అసాధ్యం. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: