జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 2014 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి నూతనాంధ్రగా ఏర్పడిన తరువాత అప్పట్లో టిడిపి పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఎన్నికల సమయంలో తాను టీడీపీకి మద్దతు ఇచ్చింది దేనికంటే, చంద్రబాబు గారి మీద నమ్మకంతో అని, వారు ప్రజలకు ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చకపోతే తాను ప్రజల తరపున నిలబడి టిడిపిని ప్రశ్నించి, అవసరం అయితే న్యాయ పోరాటానికి దిగుతానన్న పవన్, నాలుగేళ్లు కళ్ళు మూసుకుని, చిట్టచివర్లో ఎన్నికలు మరికొద్దిరోజుల్లో రాబోతున్నాయి అనే సమయంలో మొక్కుబడిగా టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందని అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తాయి. 

 

ఇక ఆ తరువాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తన జనసేన పార్టీ తరపున ప్రత్యక్షం ఎన్నికల బరిలో దిగిన పవన్, తాను పోటీ చేసిన రెండు ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అది మాత్రమే కాక ఆయన పార్టీకి కేవలం ఒకే ఒక్క సీట్ లభించింది. ఇక ఆ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి ఆంధ్ర సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ మోహన్ రెడ్డి గారు, తొలి రోజు నుండి పలు ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెట్టడంతో పాటు ఎప్పటికపుడు ప్రజలకు చేరువవుతూ, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుంటే, మరోవైపు టిడిపితో రహస్య ఒప్పందం పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఆయన పై లేనిపోని నిందలు వేయడం సరైనది కాదనే వాదనలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. 

 

ఇక నేడు వైసీపీ మంత్రి పేర్ని నాని విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో టిడిపిని ప్రశ్నిస్తాను అని చెప్పి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన పవన్ నాయుడు గారు, ప్రస్తుతం ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు టిడిపితో కలిసి ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇక టీడీపీ నుండి ఆయనకు రూ.450 కోట్లు, అలానే వారి సామజిక వర్గ ఎన్నారైల నుండి మరొక రూ. 150 కోట్లు లభించాయని, ఎన్ని సినిమాలు చేస్తే ఆయనకు అంత డబ్బు వస్తుంది చెప్పండి. అందుకే మొత్తం ఆ రూ.600 కోట్ల డబ్బు పోగేసుకుని మోసపూరిత చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ వైసిపి పై అలానే జగన్ గారిపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: