ఈ మ‌ధ్య కొంత‌మంది విచిత్రంగా త‌యార‌యారు ఎప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళ‌కే అర్ధం కావ‌డం లేదు. ఇక అమెరికాకు చెందిన ఓ మ‌హిళ త‌న‌కు పుట్ట‌బోయే బిడ్డ జెండ‌ర్ రివీల్ చేసేందుకు ఓ చిన్న ఫంక్ష‌న్ ను ఏర్పాటు చేసింది. ఆ వేడుక‌లో ఆమె అత్త గిఫ్టుగా ఓ వెరైటీ కేకును ఆర్డర్ చేసింది. కడుపుతో ఉన్న మహిళ పొట్ట నుంచి పసివాడి పాదం కనిపిస్తున్నట్లుగా ఆ కేకును రూపొందించారు. ఈ కేకు చూసేందుకు వెరైటీగానే కనిపిస్తున్నా.. చాలామందికి చాలా రకాలుగా అర్ధం చేసుకున్నారు.

ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసినవాళ్లు.. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కేకులో పసివాడి పాదం అంత సైజు ఉందేంటి? అంత పెద్ద పిల్లాడు కడుపులో ఉన్నాడా? అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం, అది పాదంలా లేదు పురుషాంగంలో ఉందని అంటున్నారు.

అది జెండర్ రివీల్ కేకు కాబట్టి.. పుట్టింది అబ్బాయని చెప్పడానికి బహుశా కేకు పాదాన్ని అంగం రూపంలో మలిచి ఉంటాడని అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా.. ఈ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే తెరతీసింది. ఇక‌పోతే ఈ మ‌ధ్య కేకులు ర‌క ర‌కాల ఆకారాల్లో మ‌న‌కి ఎలా కావాలంటే అలా చేస్తున్నారు. బేక‌రీ వాళ్ళ క‌ళ‌ల‌కి ఎవ్వ‌రైనా ఫిదా అవ్వ‌వ‌ల‌సిందే. ఇక‌పోతే కేవ‌లం క‌ళ మాత్ర‌మే కాదు టేస్ట్ కూడా కొన్ని కొన్ని కేక్స్ అదే రేంజ్‌లో ఉంటాయి. అలాగే రేట్లు కూడా ఒక్కో బ్యాక‌రీలో ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని టేస్ట్ విష‌యంలో అస‌లు కాంప్ర‌మైజ్ కారు . అలాంటి వారు రేటు కూడా కాస్త ఎక్కువే పెడ‌తారు. అలాగే క్వాంటిటీ కూడా ఎక్క‌డా త‌క్కువవ‌దు. అదే రేంజ్‌లో మెయిన్‌టెయిన్ చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: