డబ్బంటే ఎవరికి చేదు.. డబ్బుకు లోకం దాసోహం అంటున్నారు.  ఈ సమాజంలో డబ్బున్న వాడే దేవుడు..అది లేనివాడు ఎందుకూ పనికిరాడు అన్న పరిస్థితి నెలకొంటుంది.  అందుకే మనిషి ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడుతున్నాడు.  తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులతో ఉన్నత శిఖరాలు అధిరోహించేవారు కొందరైతే.. కష్టపడి స్వయం శక్తితో పైకి వచ్చేవారు మరికొందరు.  అయితే ఎలాంటి కష్టం లేకుండా...అప్పలంగా డబ్బు సంపాదించేవారు ఇప్పడు సమాజంలో ఎక్కువ అవుతున్నారు.  ఇందుకోసం వారు ఎంత నీచమైన పనికైనా సిద్ద పడుతున్నారు.  అక్రమంగా డబ్బు సంపాదించాలంటే ఆడవారి శీలానికి ఖరీదు కడుతూ వారితో వ్యభిచారం చేయిస్తూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించేవారు ఎక్కువే అవుతున్నారు. మరి దరిద్రమైన విషయం ఏంటేంటే.. ఇలా డబ్బు సంపాదించే క్రమంలో కలిగిన వారు కూడా ఉంటున్నారు.  

 

తాజాగా కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతున్న రాజకీయ నాయకుల శృంగార వీడియోల వెనుక ఓ టాప్ సీనియర్ హీరోయిన్ తో పాటు, మరో ఇద్దరు నటీమణులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.   ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలను హనీట్రాప్ చేశారని, వారితో శృంగారం జరుపుతూ వీడియోలు చిత్రీకరించారని భావిస్తున్న పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఈ కేసులో ఆ హీరోయిన్ ఇప్పటికే పాతిక సినిమాల్లో నటించినట్లు సమాచారం. ఇక మిగతా ఇద్దరు చిన్ని సినిమాలు, టీవి సిరియల్స్ లో నటించినట్లు సమాచారం. గత వారం ఈ హనీట్రాప్ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వీడియోలు బయటకు వచ్చాయి.  

 

ఈ వార్త సోషల్ మీడియాలో దుమ్మురేపింది..దాంతో పోలీసు సైతం కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో ముద్దాయి రాఘవేంద్ర, తన ప్రియురాలిని, కొందరు అమ్మాయిలను ఎమ్మెల్యేల వద్దకు పంపి వారితో పరిచయాలు పెంచుకున్నాడని పోలీసులు గుర్తించారు.  ఈ వ్యవహారం అంతా సినీ ఫక్కీలో నిర్వహిస్తూ ఆ వీడియోలు బాధితులకు చూపించి డబ్బులు డిమాండ్ చేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటకు వచ్చింది. రాఘవేంద్రను, అతని ప్రియురాలినీ విచారించగా, సినీ హీరోయిన్ల ప్రమేయంపై ఉప్పందినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: