అత్యంత దారుణంగా లైంగికదాడి, హత్యకు గురైన దిశ కేసులో సంచ‌ల‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు  బాధిత కుటుంబసభ్యులకు సత్వర న్యాయం అందించేందుకు, నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేయ‌డంతో పాటుతా షాద్ న‌గ‌ర్ కోర్టు ఏడురోజుల క‌స్ట‌డీకీ అనుమ‌తించ‌డం తెలిసిన సంగ‌తే. ఇదే స‌మ‌యంలో నిందితులు ఆరిఫ్ అలీ, చెన్నకేశవులు, శివ, నవీన్ ప్రస్తుతం చర్లపల్లి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌లలో ఉన్నారు. అయితే, తాజాగా పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈ కేసును సత్వరమే తేల్చాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

దిశ కేసు విష‌యంలో సంచ‌ల‌న‌, ఒళ్లు గ‌గుర్పొడిచే ప‌రిణామాల‌ను తేల్చేందుకు నిందితుల విచారణ కీల‌కంగా మారింది. ఈనేప‌థ్యంలో శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన నలుగురు అడిషినల్ ఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల  సిట్ బృందం ఏర్పాటయ్యింది. వారం రోజుల కస్టడీలో నిందితుల దగ్గర నుండి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ సిట్ బృందం మొత్త సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్ చేయనుంది. అంటే... దిశ ఇంటి నుంచి బయలుదేరిన దగ్గరి నుంచి ఆమెను పెట్రోల్ పోసి కాల్చిన సమయం వరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనే దాన్ని మ‌రోమారు ప్ర‌త్య‌క్షంగా తెలుసుకుంటారు. ఇందుకోసం అత్యాచారం, హత్య జరిగిన స్థలానికి నిందితులను తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకనస్ట్రక్షన్ చేయనున్నారు.

 

నిందితుల ద్వారానే సీన్ టూ సీన్ మొత్తం వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దిశ మొబైల్ ఏం చేశారు? దిశను ఏ విధంగా ట్రాప్ చేశారు? అత్యాచారం చేసే ముందు మద్యం సేవించారా? ఎందుకు హత్య చేశారు?  అనే విషయాలపై పోలీసులు మరోసారి ఆరా తీయనున్నారు. దీంతోపాటుగా కస్టడీ పూర్తయిన మరుక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: