సాధారణంగా కోతి - కుక్కకు అస్సలు పడదు.  ఎక్కడైనా కోతి కనిపిస్తే చాలు కుక్కలు బౌ బౌ అంటూ వెంట పడుతుంటాయి.  అయితే  ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతి వైరం మరచి ఓ కోతి అమ్మ ఎవరికైనా అమ్మే అన్నట్టుగా, ఆ కోతి కుక్కపిల్లను ఆదరించి అక్కున చేర్చుకుంది.  కన్న తల్లిలా ఆహారం అందిస్తూ.. దాన్ని అటూ ఇటూ తిప్పుతూ సేవలు చేసింది.  ఇదేంటీ కోతి కుక్కపిల్లను దత్తత తీసుకోవటం ఏంటీ అనే ఆశ్యర్యంతో కూడిన ఆసక్తి..కలుగుతుంది. ఆ కోతి ఎక్కడికి వెళితే అక్కడికి ఆ కుక్కపిల్లను తీసుకెళుతోంది. దానికి దొరికిన ఆహారాన్ని కుక్కపిల్లకు పెడుతోంది. ఆ కుక్కపిల్ల కూడా కోతిని విడిచిపెట్టకుండా తిరుగుతోంది.

 

కుక్కపిల్లకు పాలు ఆహారం పెడుతోంది. వాటికి పక్క వేసి వసతి కూడా ఏర్పాటు చేసింది. కుక్కపిల్లకు కోతి అన్ని రకాలుగా సపర్యలు చేస్తూనే ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది. కానీ కోతి దాన్ని ఎత్తుకొని తిప్పుతుండడంతో ఏదైనా ప్రమాదం జరగొచ్చని భావించి ఆమె సమాచారం ఇచ్చారు.  అను బిష్త్ అనే ఓ మహిళ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి వాటిని వేరు చేశారు.  ఆ కుక్క పిల్లను తాను పెంచుకుంటానని చెప్పడంతో అను బిష్త్‌కు అప్పగించారు.  తర్వాత కోతిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

 

అయితే కోతి తన సొంత బిడ్డలా కుక్క పిల్లను చూసుకుంటున్న విధానం చూస్తుంటే..అందరూ ఆశ్చర్యపోయారు.  వీటిది ఏనాటి రుణబంధమో ఇలా కలుసుకున్నాయని అనకుంటున్నారు.  మనిషిని సాటి మనిషే పట్టించుకోని ఈ సమాజంలో మూగ జీవాలు తమ జాతి వైరాన్ని మరిచి కలిసి మెలిసి తిరగడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ మద్య మనుషులు కృర మృగాళ్లా మారుతూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్న సందర్భంగా నోరులేని మూగజీవాల్లో కనిపించే మానవత్వం..మనుషుల్లో కనుమరుగవుతుందంటూ.. పలువురు కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: